Saina Nehwal: ఈ మధ్య కాలంలో స్టార్ సెలెబ్రిటీలు ఎక్కువగా విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇక మన దేశంలో అయితే సెలబ్రిటీల విడాకులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. ఎందుకంటే, చిన్న చిన్న కారణాలతోనే సినీ, క్రీడా రంగాల్లోని ప్రముఖులు డివోర్స్ తీసుకుని విడిపోతున్నారు. ముఖ్యంగా, ఇటీవలి కాలంలో క్రీడాకారుల విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా, భారత బ్యాడ్మింటన్ స్టార్ జంట సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు తమ విడాకులను అధికారికంగా ప్రకటించిన విషయం మనకీ తెలిసిందే
Also Read: Ponguleti srinivas: కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు: మంత్రి పొంగులేటి
కలిసిపోయిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్
హైదరాబాద్‌కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇటీవల విడిపోతున్నట్లు ప్రకటించినప్పటికీ, తమ నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ ఒక్కటయ్యేందుకు సిద్దమయ్యారనే తెలుస్తుంది. సైనా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో దీని గురించి చెబుతూ సంచలన పోస్ట్ షేర్ చేసింది. కొన్నిసార్లు దూరం సన్నిహితుల విలువను తెలియజేస్తుందంటూ ఇన్‌స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో కశ్యప్‌తో ఉన్న ఫోటోను కూడా జోడించింది.
Also Read: Sai Rajesh: ‘బేబి’కి నేషనల్ అవార్డ్స్.. నన్ను ఎవరూ నమ్మని రోజు ఆయన నమ్మాడంటూ డైరెక్టర్ ఎమోషనల్!
జూలై 13న సైనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా కశ్యప్‌తో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2018లో సైనా, కశ్యప్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో లెజెండరీ కోచ్ గోపీచంద్ శిక్షణలో కలుసుకున్న ఈ జంట, అక్కడే తమ ప్రేమకథ అక్కడ మొదలైంది. విడిపోవడానికి కారణాలు స్పష్టంగా తెలియకపోయినా, కశ్యప్‌తో గడిపిన క్షణాలను సైనా ఇప్పుడు సంతోషంగా గుర్తు చేసుకుంది.
సైనా నెహ్వాల్ ఒలింపిక్ కాంస్య పతక విజేతగా, ప్రపంచ నంబర్ 1 ర్యాంకర్‌గా భారత బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించింది. కరణం మల్లేశ్వరి తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన రెండో భారతీయ మహిళగా, 2015లో మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1గా నిలిచిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించింది.