Greater Warangal Municipal Corporation: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మరోసారి కాంట్రాక్ట్ అవకతవకల ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి. గతంలో రూ. 8 కోట్ల కాంట్రాక్ట్‌లో అక్రమాలకు పాల్పడి, నిధుల దుర్వినియోగం చేసిన సంస్థకే మళ్లీ రూ. 2.89 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం నగరవాసుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తూ, అధికారులు, పాలకవర్గం స్వప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నారనే ప్రశ్నలు లేవనెత్తుతుంది.’
Also Read: Child Marriage: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం!
❄️గతంలో ఏం జరిగింది?
2021లో, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, దోమల నియంత్రణ కోసం చెత్త సేకరణ వాహనాలు, హుక్ లోడర్స్, కాంపాక్టర్స్, ఫాగింగ్ ఆటోలు, ఫాగింగ్ మిషన్ల కొనుగోలు కోసం జీడబ్లూఎంసీ తెలంగాణ ఆగ్రోస్(Telangana Agros)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ. 5 కోట్లు ముందుగా చెల్లించారు. అయితే, ఒప్పందం ప్రకారం 15 రోజుల్లో సరఫరా కావాల్సిన పరికరాలు ఆలస్యమయ్యాయి. సరఫరా చేసిన వాటిలో నాణ్యత లేని హుక్ లోడర్స్, ఫాగింగ్ ఆటోలు, మిషన్లు ఉన్నాయి. హుక్ లోడర్స్‌కు సరిపడే బాక్సులు లేకపోవడంతో అవి నిరుపయోగంగా మిగిలాయి. 66 ఫాగింగ్ మిషన్లలో 35 నాణ్యత లేనివిగా గుర్తించబడ్డాయి. కొన్ని పరికరాలు సరఫరా కాకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల నిధులు వృథా అయ్యాయని విమర్శలు వస్తున్నాయి.
❄️మళ్లీ అదే సంస్థకు కాంట్రాక్ట్ ఎందుకు?
తెలంగాణ ఆగ్రోస్(Telangana Agros)ద్వారా ఎస్‌డీఎస్ అనే థర్డ్ పార్టీ సంస్థకు సబ్-కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ, నాణ్యత లేని పరికరాల సరఫరాతో అధికారులు తలలు పట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆగ్రోస్ (Agros ద్వారా “హాక్” అనే సంస్థకు రూ. 2.89 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వాలనే చర్చ జరుగుతుంది. ఇందులో మొబైల్ టాయిలెట్ల కోసం రూ. 1.50 కోట్లు, 10 చెత్త సేకరణ ఆటోల కోసం రూ. 1.30 కోట్లు కేటాయించారు. టెండర్ నిబంధనలు పాటించకుండా, బహిరంగ కొటేషన్లు తీసుకోకుండా అదే సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక రాజకీయ ఒత్తిడి, స్వలాభం ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
❄️cపాలకవర్గం ఒత్తిడి..
పాలకవర్గం పాలన కాలం ముగియబోతున్న నేపథ్యంలో, కీలక నాయకులు తమకు తెలియకుండా ఏ పనులూ జరగకూడదని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చర్చ జరుగుతుంది. అక్రమాలకు సహకరిస్తే అధికారులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నగరవాసులు హెచ్చరిస్తున్నారు.
❄️అధికారుల నిర్లక్ష్యం..
గత అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడం, అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది. వివరణ కోసం అడిగినప్పుడు, “మాకు తెలియదు”, “కొత్తగా వచ్చాం”, “మేయర్‌ను అడగండి” అంటూ అధికారులు సమాధానాలు దాటవేస్తున్నారు. తెలంగాణ ఆగ్రోస్(Telangana Agros) అధికారులు కూడా ఎస్‌డీఎస్ సంస్థ నిర్వాకంపై ఏమీ చేయలేమని వాపోతున్నారు.
అవినీతిలో అందరూ భాగస్వాములే..
అవినీతి జరిగినా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఆగ్రోస్(Telangana Agros) అధికారులు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని పరికరాలు సరఫరా చేసిన వారికి మళ్లీ కాంట్రాక్ట్ ఇవ్వడం చూస్తే ఈ అవినీతిలో అందరూ భాగస్వాములే అనే అనుమానం కలుగుతుంది.
❄️బషీర్, నగరవాసి
విజిలెన్స్ విచారణ జరిపించాలి..
కోట్లలో ప్రజాధనం దుర్వినియోగం అయినా అదే కంపెనీకి మళ్లీ కాంట్రాక్ట్ దక్కడం చూస్తే బల్దియాలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్,(Greater Warangal Municipal Corporation,) తెలంగాణ ఆగ్రోస్ మధ్య జరిగిన ఒప్పందాలపై విజిలెన్స్ విచారణ జరిపితే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తాయి.
❄️బాబు, నగరవాసి
Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్