Child Marriage: రంగారెడ్డి జిల్లా నందిగామలో జరిగిన బాల్య వివాహ ఘటనా ఆలస్యంగా వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో బలవంతంగా వివాహం జరిపించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే చదువును కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ఉన్న ఆ బాలిక ధైర్యంగా ఈ అన్యాయాన్ని ఎదిరించి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆశ్రయించింది. నందిగామకు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ కుమారుడు, 8వ తరగతి చదువుతున్న కుమార్తెను పోషిస్తోంది.
40 ఏళ్ల వ్యక్తికి ఆస్తి ఉందని
కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లి తన కుమార్తె పెళ్లికి మధ్యవర్తిని ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా,(Rangareddy District,) చేవెళ్ల మండలం, కందవాడకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ఆస్తి ఉందని చెప్పి, మధ్యవర్తి ఈ సంబంధాన్ని ఖరారు చేశాడు. దీంతో, మే 28న ఈ బలవంతపు వివాహం జరిగింది.కానీ, ఈ వివాహం తన ఇష్టానికి వ్యతిరేకమని, తాను చదువుకోవాలనుకుంటున్నానని బాలిక ఈ నెల 29న, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ధైర్యంగా తెలిపింది. వెంటనే స్పందించిన ప్రధానోపాధ్యాయుడు బాలికను నందిగామ తహసీల్దార్(Tahsildar)వద్దకు తీసుకెళ్లారు.
బాల్య వివాహ నియంత్రణ చట్టం
తహసీల్దార్ (Tahsildar)సమాచారం ఇవ్వడంతో పోలీసులు(Police) రంగంలోకి దిగి బాలిక ఫిర్యాదు ఆధారంగా ఆమె తల్లి, వరుడు, మధ్యవర్తి, వివాహం జరిపిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం(Child Marriage Control Act) (ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, 2006) కింద కేసు నమోదు చేశారు. అనంతరం, బాలికను సురక్షితంగా రెస్క్యూ హోంకు తరలించారు. బాల్య వివాహాలు జరిపించoడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని, తల్లిదండ్రులు బాలిక ఆరోగ్య పరిస్థితి మానసిక పరిస్థితిని ఏమాత్రం విస్మరించ వద్దు అని, పెళ్లి వయస్సు వచ్చిన తరువాతనే బాలికలకు పెళ్లి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Magam Rangareddy Passes Away: బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత అకస్మిక మృతి.. కారణాలివే!