Child Offering Ritual: భారతదేశం అంటే సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్కడ హిందూ ధర్మం ఎక్కువగా కనిపిస్తుంది, దేవాలయాలు, జాతకాలు, నమ్మకాలు, ఆచారాలు మన జీవన విధానంలో ఒక భాగమైపోయాయి. మన దేశంలోని ప్రజలు హిందూ దేవతలను ఆరాధిస్తూ, ఒక్కో ఆలయంలో ఒక్కో విశిష్ట సాంప్రదాయం పాటిస్తూ, భక్తులు తమ కోరికలను నెరవేర్చుకుంటారు. అయితే, ఓ గుడిలో వింత ఆచారం పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలోని కోదండ రామాలయంలో కనిపిస్తుంది.
Also Read: Tollywood: హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ లవ్ బర్డ్స్.. త్వరలో, పెళ్లి పీటలు ఎక్కుతారా?
ఇక్కడి ప్రజలు ఈ ఆలయంలో ప్రతి శ్రీరామనవమి రోజున ఒక ప్రత్యేక సాంప్రదాయం ఖచ్చితంగా పాటిస్తారు. భక్తులు తమ కన్నబిడ్డలను శ్రీరాముడికి సమర్పిస్తారు. అవును మీరు వింటున్నది నిజమే. ఇదేం ఆచారం అని షాక్ అవుతున్నారా? అవును, తమ పిల్లలను దేవుడికి “అమ్మేసి”, వేలం పాటలో ప్రత్యేకంగా పాట పాడి మళ్లీ వారే, కొనుక్కుంటారు. ఈ విచిత్రమైన ఆచారం కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, 1889 నుంచి కొనసాగుతోంది. ఇలా చేయడం వలన పిల్లలకు మంచి జరుగుతుందని, అలాగే శ్రీరాముని ఆశీస్సులు కూడా ఉంటాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
Also Read: Vishwambhara: ఆ పాట కాంట్రవర్సీపై స్పందించిన విశ్వంభర డైరెక్టర్.. అందుకేనా అలా చేసింది
ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ఇక్కడ శ్రీరాముడిని మొక్కుకుని, సంతానం కలిగిన తర్వాత తమ బిడ్డను దేవుడికి సమర్పించి, కొంత డబ్బు చెల్లించి తిరిగి తీసుకుంటారు. అంతేకాదు, ఈ ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణం మేళా తాళాలతో వైభవంగా జరుపుతారు. కళ్యాణంలో సమర్పించే తలంబ్రాలను భక్తులు పరమాన్నంగా వండి, ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా దైవానుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్మకం.
గమనిక: ఇంటర్నెట్ నుం చి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.