Bhatti Vikramarka: ఇందిరమ్మ చీరల పంపిణీపై మహిళల హర్షం
Bhatti Vikramarka (imageCREDIT: SWETCHA REPORTE)
నార్త్ తెలంగాణ

Bhatti Vikramarka: ఇందిరమ్మ చీరల పంపిణీపై మహిళల హర్షం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, చీరల నాణ్యత, డిజైన్ పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మంత్రి సీతక్క (ములుగు నుంచి) తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ సంక్షేమ పథకాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు రూ. 304 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు.

చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి

ఆయా నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అలాగే, గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలపై గణాంకాలతో సహా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, అన్ని జిల్లాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని గడువు విధించారు.

Also Read: Bhatti Vikramarka: గురుకులాల డైట్, అద్దె బకాయిలు విడుదల చేయండి : డిప్యూటీ సీఎం ఆదేశం

మహిళా సమాఖ్య సభ్యుల భాగస్వామ్యం ఉండేలా చూడాలి

వడ్డీ లేని రుణాల పంపిణీలో గ్రామ, మండల, జిల్లా మహిళా సమాఖ్య సభ్యుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని అన్నారు. అర్హులైన వారికి రెండు పడక గదుల ఇళ్లు, విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో పాల్గొన్న గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ, జిల్లాలోని సుమారు 80,000 మంది మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ సజావుగా సాగుతుందని తెలిపారు. మంగళవారం జరగనున్న వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు సహా పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Also ReadBhatti Vikramarka: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఒక గేమ్ ఛేంజర్: భట్టి విక్రమార్క

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!