Bhatti Vikramarka ( image credit: swetcha reporter)
తెలంగాణ

Bhatti Vikramarka: గురుకులాల డైట్, అద్దె బకాయిలు విడుదల చేయండి : డిప్యూటీ సీఎం ఆదేశం

Bhatti Vikramarka: ఎస్సీ, మైనారిటీ గురుకులాలు, హాస్టళ్ల డైట్, అద్దె బకాయిలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.163 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.  సాయంత్రం ప్రజాభవన్‌లో ఆర్థిక శాఖ, గురుకులాల అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిల వివరాలను డిప్యూటీ సీఎం స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ గురుకులాలు, హాస్టళ్లు, ఇతర సంస్థలకు సంబంధించిన డైట్, అద్దె, కాస్మొటిక్స్ బకాయిలకు సంబంధించిన రూ.51.36 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.

Also Read:Deputy CM Bhatti Vikramarka: ప్రపంచ స్థాయి కంపెనీలకు కేంద్రం హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలి

వీటితోపాటు రాష్ట్రంలోని అన్ని మైనారిటీ గురుకులాలు, మైనార్టీ విద్యాసంస్థలకు సంబంధించిన డైట్, అద్దె బకాయిలు రూ.47.61 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.63.92 కోట్ల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో, వైవిధ్యంతో కూడిన ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో గురుకులాలు, వసతి గృహ విద్యార్థుల డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలు 200 శాతం పెంచిన విషయాన్ని భట్టి గుర్తు చేశారు.

ఆహార నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దు 

నిర్వహకులు ఆహార నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పూర్తిస్థాయిలో పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించేందుకు అధికారులు నిర్దేశిత క్యాలెండర్ ప్రకారం సందర్శించాలని సూచించారు. అధికారుల సందర్శనకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు నిర్వాహకులు నివేదించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

Also ReadBhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్షిప్ రూ.303 కోట్లు వెంటనే విడుదల చేయాలి: భట్టి విక్రమార్క

Just In

01

Chennai Love Story: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ పోస్టర్.. స్పెషల్ ఏంటంటే?

Warangal: వరంగల్‌లో ఏడీబీ ప్రతినిధుల పర్యటన.. ముంపు ప్రాంతాలు, నాలా స్థితిగతుల పరిశీలన

Collector Santhosh: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు కృషి.. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలి కలెక్టర్ సంతోష్

Terror Accused Dr Shaheen: మహిళా టెర్రర్ డాక్టర్.. ఈమె గురించి తెలిస్తే.. బుర్ర బద్దలు కావాల్సిందే?

OnePlus 15 India Launch: గుడ్ న్యూస్.. మరి కొద్దీ గంటల్లో OnePlus 15 ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవే!