Deputy CM Bhatti Vikramarka: ప్రపంచ స్థాయి కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మల్లు అన్నారు. హైదరాబాదులో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వాన్ గార్డ్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం అంటే రాష్ట్రంలో టెక్నాలజీ, ఆవిష్కరణలకు ఒక గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. హైదరాబాద్ లోని నాలెడ్జ్ సెంటర్లో మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి సోమవారం వాన్ గార్డ్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించిన మాట్లాడారు. రాష్ట్రంలో టెక్నాలజీ , ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతున్న భాగ్యనగరం ప్రతిష్టకు గొప్ప గుర్తింపు అని అభివర్ణించారు. మౌలిక వసతులు, వ్యాపారానుకూల విధానాలు, ప్రతిభతో నిండిన ఎకోసిస్టమ్ కారణంగా, ప్రపంచ స్థాయి కంపెనీలకు హైదరాబాద్ ప్రాధాన్య గమ్యస్థానంగా ఎదిగిందన్నారు.
Also Read: Deputy CM Bhatti Vikramarka: బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు.. వచ్చిన భక్తులందరికీ అమ్మవారి దర్శనం
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, గ్లోబల్ ఏఐ స్కూల్
ప్రతి సంవత్సరం వేలాది మంది నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులను హైదరాబాద్ అందిస్తుందని తెలిపారు. జీవితాలు, ఆర్థిక వ్యవస్థలను మార్గనిర్దేశం చేయడంలో సాంకేతిక శక్తిపై తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ విశ్వాసం ఉంచి ముందుకు పోతుందన్నారు. గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, గ్లోబల్ ఏఐ స్కూల్ వంటి కార్యక్రమాలతో ఆవిష్కరణ, స్టార్టప్‌లు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే వ్యవస్థను నిర్మించామన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలకు తెలంగాణలో వ్యాపారం చేసే వేదిక మాత్రమే కాకుండా, అభివృద్ధిలో భాగస్వామిని కూడా అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అన్ని రకాల మౌలిక వసతులతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం వంటి సదుపాయాలను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో వాన్ గార్డ్ సొంత కేంద్ర నిర్మాణానికి సంబంధిత మంత్రులు చొరవ చూపాలని తాను కోరుతున్నానన్నారు.
1.2 లక్షల ఉద్యోగాలులక్ష్యం
హైదరాబాద్ ప్రస్తుతం విశ్వసనీయత, సమగ్రత, ఇన్నోవేషన్ కు చిరునామాగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. వాన్‌గార్డ్ తమ ‘గ్లోబల్ వ్యాల్యూ సెంటర్(జీవీసీ)’ను ప్రారంభించేందుకు హైదరాబాద్ ను ఎంచుకోవడం ఈ నగర సామర్థ్యానికి నిదర్శనమన్నారు. వచ్చే ఏడాదిలో 120 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను ప్రారంభించి, 1.2 కొత్తగా 1.2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతకు స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ లో అత్యుత్తమ నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. వాన్ గార్డ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పట్టి “రైజింగ్ తెలంగాణ”లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
Also Read: Deputy CM Bhatti Vikramarka: 2030 నాటికి 20 వేల మెగావాట్ల.. గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం!
