Gadwal District: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Gadwal District ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Gadwal District: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. పట్టుకుని వదిలేసిన పీడిఎస్ బియ్యం వాహనం ఎవరిది?

Gadwal District: గద్వాల జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గద్వాల నియోజకవర్గంలో ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో  వేకువజామున రేషన్‌ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న ఓ వాహనాన్ని సంబంధిత అధికారులు పట్టుకుని, ఆ తరువాత కొద్ది సేపటికి వదిలేసినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ నాయకులు అండనా లేక ఆర్థిక లావాదేవీలు కారణమా అనే అంశంపై కూడా చర్చించుకుంటున్నారు. పట్టుబడింది రేషన్ బియ్యం వాహనమేనా మరేదైన వాహనమా అన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం తరలిస్తున్న వాహాన్నాన్ని పట్టుకుని.. వదిలేసిన ఘటన వాస్తవమని చర్చించుకుంటున్నారు.

Also ReadGadwal District: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ఉత్కంఠ.. అందరి చూపు అటువైపే..?

సోషల్ మీడియాలో వైరల్‌

అది ఆ నోట, ఈ నోట పడి సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. రేషన్‌ స్మగ్లర్లుకు సంబంధించిన గ్రూపులతో పాటు ఆ మండలంలోని పలు వాట్సప్ గ్రూప్ లలో ఆ విషయం వైరల్‌గా మా రినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే పట్టుబడ్డ రేషన్ బియ్యం వాహనం అక్రమార్కులు తరలించే క్రమంలో పట్టుబడినట్లు‌ కొందరు రేషన్ స్మగ్లర్లుకు తెలిసినప్పటికి వారు మౌనంగా ఉన్నట్లు తెలిసింది. గద్వాల నుంచి రాయచూర్‌కు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న క్రమంలో రేషన్ బియ్యం వాహనాన్ని పట్టుకోవడం జరిగిందని, పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇన్ఫార్మర్లు బహిరంగానే చెప్పుకుంటున్నారు. నిత్యం గద్వాల నుంచి రాయచూర్ కు పీడిఎస్ బియ్యం తరలిపోతున్నట్లు రేషన్ స్మగ్లర్లే సమాచారం ఇచ్చి పట్టిస్తుండటం కొసమెరుపు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరేందుకు సంప్రదించగా ఎవరు అందుబాటులోకి రాలేదు.

Also Read: Gadwal District: డేంజర్ బెల్స్.. గద్వాల జిల్లాలో పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. ఇవిగో లెక్కలు..?

Just In

01

Sankranti Safety Alert: పతంగులు ఎగురవేస్తున్నారా? జర భద్రం.. విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ కీలక సూచనలు!

GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో రూ.7038 కోట్లతో ఫ్లై ఓవర్లు.. కేబీఆర్ పార్కు చుట్టు పనులకు మోక్షం ఎపుడూ?

Mega Blockbuster: సంక్రాంతికి కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’..

Rahul IAS: తన వెడ్డింగ్ కార్డ్ నే కాదు.. ఇప్పుడు కొడుకు పేరున రిలీజైన త్రీడీ వీడియో రివ్యూ నెట్టింట వైరల్.. ఎవరా ఐఏఎస్ ఆఫీసర్?

Naari Naari Naduma Murari Review: శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’.. ఫుల్ రివ్యూ