Gadwal News: మార్కెట్ యార్డ్ ప్రహరీ గోడ కూల్చివేత!
Gadwal News (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal News: మార్కెట్ యార్డ్ ప్రహరీ గోడ కూల్చి.. దర్జాగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులు..?

Gadwal News: జిల్లాలో ఇష్టారాజ్యంగా సర్కారు భూముల కబ్జాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను బడా నేతల అండదండలతో వరుస పెట్టి కబ్జాలకు పాల్పడుతున్నప్పటికీ వాటిని అరికట్టే వారే కరువయ్యారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని టెన్ పర్సెంట్ స్థలాలలో పార్కులు, రి క్రియేషన్ కేంద్రాలును కొందరు అక్రమార్కులు కబ్జా చేసేందుకు తెరలేపుతున్నారు. తాజాగా గద్వాల నడిబొడ్డున ఉన్న మార్కెట్ యార్డులో ప్రహరీ గోడను పట్టపగలే కూల్చి వేశారు. మార్కెట్ యార్డ్ లో మార్కెట్ కమిషన్ మర్చంట్ నిర్వాహకులు కోట్లు విలువ చేసే స్థలాన్ని ఆక్రమించి షాపులు చేసేందుకు పథకం ప్రకారం పనులను చేపడుతున్నారు. గద్వాల రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి చింతల పేటకు వెళ్లే ప్రధాన రహదారి గుండా మార్కెట్ కాంపౌండ్ గోడను తొలగింపులో భాగంగా గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీ కాలువను ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించారు. అదే స్థలంలో చిన్నపాటి కాలువను నిర్మించారు. నేడు ఏకంగా ప్రహరీ గోడను జెసిబి ని ఉపయోగించి తొలగించారు. ఇప్పటికే ఐరన్ తో కూడిన రెడీమేడ్ షట్టర్ ను ఏర్పాటు చేసుకోగా క్రమంగా అక్రమంగా షాపుల నిర్మాణానికి ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

సెలవు దినం కావడంతో

ఆదివారం సెలవు కావడంతో అక్రమార్కులు తమ తమ కుట్రలో భాగంగా ఏకంగా ప్రభుత్వ నిధులతో నిర్మించిన మార్కెట్ యార్డ్ కాంపౌండ్ గోడను కూల్చివేశారు. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు సర్వే నంబర్ 841 తో పాటు పలు సర్వే నంబర్లలోని 62 ఎకరాల పైగా ఉన్న భూమిలో ఇతరత్రా ప్రభుత్వం నిర్మాణాలకు పోను కేవలం 50 ఎకరాలు మాత్రమే యాడుకు అందుబాటులో ఉంది. దీనిలో సైతం అక్రమార్కులు తమ సొంత ప్రయోజనాల కోసం షాపింగ్ నిర్మాణాల కోసం వ్యాపారస్తులు మార్కెట్ స్థలాన్ని కబ్జాలకు పాల్పడుతున్నారు.

Also Read: Medaram Jatara 2026: మేడారంలో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్.. రూ.6 కోట్లతో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్లాన్!

రోడ్డుపైనే ఇంటి నిర్మాణం

జిల్లా కేంద్రంలో కొత్త హౌసింగ్ బోర్డ్ కాలనీలో సర్వేనెంబర్ 789 లో రెండు ఎకరాల స్థలంలో ఎల్పీ ద్వారా వెంచర్ను ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు గుంటల స్థలాన్ని ప్రజా అవసరాల నిమిత్తం వదిలేశారు అయితే ఈ ఖాళీ స్థలంతో పాటు 40 ఫీట్ల రోడ్డును సైతం కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసి ప్లాట్లకు డాక్యుమెంట్ సైతం సృష్టించుకున్నారు. దీనిని క్రమంగా అధికార పార్టీ నేతలు తక్కువ రేట్లకు కొనుగోలు చేశారు. క్రమంగా ఈ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. దీనితోపాటు ఇతర ఖాళీ స్థలంలో సైతం అక్రమంగా షాపుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇట్టి నిర్మాణాలపై స్థానికులు అభ్యంతరాలు తెలుపుతూ వినతి పత్రాలు ఇస్తున్న సంబంధిత అధికారులు చర్యలు పోనుకోకపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

బసవన్న చౌరస్తాలో సైతం

రెండవ రైల్వే గేట్ సమీపంలోని బసవన్న చౌరస్తాలో సైతం టెన్ పర్సెంట్ ల్యాండ్ లో అక్రమంగా షాపుల నిర్మాణం చేపడుతుండగా స్పందించిన మున్సిపల్ అధికారులు పోలీసుల బందోబస్తుతో జెసిబి తో పాక్షికంగా కూల్చారు. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలలో అధికారులు బిజీగా ఉండగా కొత్త మున్సిపాలిటీ పాలకవర్గాలు కొలువు తీరక ముందే టార్ఫాలిన్ కట్టి గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ నిర్మాణాలు,10% స్థలాలపై అధికారులు నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకొని భూమిని కాపాడాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Also Read: Padma Awards 2026: మమ్ముట్టికి పద్మ భూషణ్.. మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లకు పద్మశ్రీ

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?