Black Jaggery: సూర్యా భాయ్ అక్రమ నల్ల బెల్లం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రైతుల (Farmers) వద్ద నుండి కొనుగోలు చేసిన నల్లబెల్లాన్ని గూడూరు మండలం మట్టేవాడ పాఠశాల సమీపంలో దిగుమతి చేసే క్రమంలో సమాచారం అందుకున్న సిసిఎస్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న డీసీఎం లోని 100 క్వింటాళ్ల నల్లబెల్లాని స్వాధీనం చేసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ అక్రమ దందాకు సూర్యా భాయ్ కీలక వ్యాపారి కాగా, ఆయనతోపాటు మరో 9 మంది ఈ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాత్రి సమయంలో డీసీఎం లో ఉన్న 100 క్వింటాళ్ల నల్ల బెల్లం డిసిఎం ను సి సి ఎస్ పోలీసులు సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.
Also Read: Black Jaggery: అధికారుల సహకారంతో జోరుగా నల్ల బెల్లం దందా.. ఎక్కడంటే..?
కేసులు కాకుండా బెరసారాలు
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు 100 క్వింటాళ్ల నల్ల బెల్లం తరలిస్తున్న డీసీఎంను యజమాని సూర్య తో పాటు మొత్తం పదిమంది ఈ దందాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ భేరసారాలను మాజీ ప్రజా ప్రతినిధి డీల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అక్రమ వ్యాపారంలో పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు అక్కడి ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే పదిమందిలో ముగ్గురు పై మాత్రమే కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నారని మట్టేవాడ గ్రామ ప్రజలు విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు.
భేరసారాలకు తావిస్తారా?
ఈ అక్రమ దందా గత కొన్ని సంవత్సరాలుగా అధికారుల సహకారంతోనే నడుస్తుందని అక్కడి ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. అయితే మట్టేవాడ ప్రజలు చర్చించుకునే విధంగా పోలీసులు విధులు నిర్వహిస్తారా? భేరసారాలకు తావిస్తారా? లేదంటే పోలీసు శాఖ నిబంధనల ప్రకారం పదిమందిపై కేసులు నమోదు చేస్తారా..? అనే చర్చ కూడా విస్తృతంగా సాగుతోంది. అక్రమ నల్ల బెల్లం వ్యాపారులు డీసీఎం తో పాటు 100 క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని వదిలివేసి పారిపోయినట్లుగా టాస్క్ ఫోర్స్, సి సి ఎస్ సిఐ హత్తి రామ్ వివరణ కోరగా వెల్లడించారు. నిందితులు బెల్లం తోపాటు డీసీఎం ను వదిలివేయడంతో ఆ వాహనాన్ని గూడూరు పోలీస్ స్టేషన్ కి తరలించినట్లుగా చెప్పారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
Also Read: Illegal Construction: తూంకుంటలో అక్రమ నిర్మాణాలకు బ్రేక్.. స్పందించిన అధికారులు

