Sand Scam: ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లు(Indiramma’s houses) నిర్మించుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ బీసీ గౌతమ్(BC Gautam) సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎండీ జనగామ జిల్లా(Jangaon District)లోని నిడిగొండ గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్ లో ఇండ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలు కలెక్టర్ తో పాటు ఎంపీడీవో(MPDO)లు హౌసింగ్ ఏఈలు పాల్గొన్నారు.
1999 బెస్మెంట్ లెవల్
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్(Collector Rizwan Basha Sheikh) మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5745 ఇళ్లకు మంజూరు అయ్యాయని, ఇప్పటి వరకు 4560 ఇండ్లు గ్రౌండింగ్ అయినట్లు తెలిపారు. 1999 బెస్మెంట్ లెవల్, 274 రూఫ్ లెవల్, 166 స్లాబ్ లెవల్ వరకు ఇండ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. ఎండీ వి సి గౌతమ్ మాట్లాడుతూ హౌసింగ్ అధికారులు, తహసిల్దార్, ఎంపీడీవోలతో సమన్వయము చేసుకుంటూ ఉచితంగా ఇసుక టోకెన్ లు ఇవ్వాలని అన్నారు. ఇసుక పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరిగినట్లు తెలిసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: National Handloom Day: చేనేత దుస్తులు దరిద్దాం.. కార్మికులను కాపాడుకుందాం!
ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్ ప్రకారం
కంకర(Gravel), ఐరన్(Iron), సిమెంటు, ఇటుకలు, ఇతర సామాగ్రిని ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే తీసుకొనేలా చూడాలని, ఎక్కువ ధరకు తీసుకొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ ఏప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు సూచించారు. ఆధార్ నెంబర్ కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోకి బిల్లు జమ అవుతుందని ఆయన అన్నారు. ప్రతీ 500 ఇళ్ళకి ఒక ఏ ఈ నీ నియమించేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఇండ్లు నిర్మించుకుంటే ఆర్థిక భారం తప్పుతుందని తెలిపారు. ఈ విషయమై అధికారులు లబ్ధిదారులకు స్పష్టం చేయాలని సూచించారు. ఈ సమావేశం లో హోసింగ్ పీడీ మాతృ నాయక్, అధికారులు పాల్గొన్నారు.
Also Read: Pratyusha Suicide case: ప్రత్యూష కేసులో కీలక పరిణామం.. డాక్టర్ సృజన్‌కు బిగ్ షాక్
