Mahabubabad CI: మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టళ్లలో సెక్యూరిటీ గార్డులను పెంచి భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత హాస్టల్ వార్డెన్ లను ఆదేశించారు. విద్యార్థులకు ఎక్కడా కూడా అసౌకర్యం కలవకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. జేఎన్టీయూ హార్టికల్చరల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, హాస్టల్స్ లను తనిఖీ చేశారు. హాస్టల్లో పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వివరించారు. హాస్టలను తనిఖీ చేసి పాయింట్ బుక్కులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి (CI Gatla Mahender Reddy) మాట్లాడుతూ… మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హాస్టల్స్ వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాచ్మెన్లను ఆదేశించారు. విద్యార్థులు సైతం వ్యక్తిగత జాగ్రత్త చర్యలను పాటించాలని వివరించారు. హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచుకోవాలన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read:Crime News: ఇదేం దారుణం.. ఇచ్చిన బాకీ తీర్చమని అడిగితే చావబాదారు.. ఎక్కడంటే..?
ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి
ఎప్పుడు… ఎక్కడ… ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన వెంటనే పోలీస్ శాఖ అధికారులను సంప్రదించాలని చెప్పారు. పోలీసులు నిత్యం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ అప్రమత్తమైన చర్యలు చేపడుతుందన్నారు. మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడా కూడా అసాంఘిక కార్యకలాపాలు, అసాంఘిక శక్తుల కార్యకలాపాలకు తావు లేదన్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పోలీసులు నిత్యం గస్తీ కాస్తున్నారని స్పష్టం చేశారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల కోసం ఏర్పాటుచేసిన యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పటిష్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు ఏర్పడకుండా పోలి శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సైకిల్ పై సవారి
మహబూబాబాద్ టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి ప్రతిరోజు ఉదయాన్నే సైకిల్ పై సవారి చేస్తూ తన విధులను నిర్వహిస్తున్నారు. పట్టణమంతా సైకిల్ పై కలియ తిరుగుతూ విద్యార్థులు, ప్రజలు, వ్యాపార సముదాయ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే కేసులు చేదించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరిస్తున్నారు. మొత్తంగా చూస్తే టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు సాగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన విధులను నిర్వహిస్తున్నారు.
Also Read: Maruthi: చెప్పుతో కొట్టుకున్న ‘బార్బరిక్’ దర్శకుడికి పబ్లిగ్గా డైరెక్టర్ మారుతి క్లాస్!
