Heavy Rains: మహబూబాబాద్ జిల్లా కేంద్రం, జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం కుండ పోత వర్షం దంచి కొట్టింది. ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా రహదారులు కనిపించకుండా వర్షం పడింది. అసలు ఇంత వర్షాన్ని ఎప్పుడూ చూడలేదని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన నిమిషాల్లోనే రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో అయితే నీరు విపరీతంగా నిలిచిపోయింది. దాదాపు 25 నిమిషాల పాటు పడిన భారీ వర్షం రహదారులను ముంచెత్తింది. మహబూబాబాద్(Mahabubabad0, కురవి(Kuravi), బయ్యారం(Bayaram), గార్ల(Garla), గంగారం(Gangaram), కొత్తగూడ(kothaguda), గూడూరు(Guduru), కేసముద్రం(Kesamudhram), నెల్లికుదురు, తొర్రూరు, నరసింహుల పేట, దంతాలపల్లి, మరిపెడ, చిన్న గూడూరు, సీరోలు, డోర్నకల్ మండలాల్లోనూ వర్షం భారీ గాని కురిసింది.
కుండ పోత వర్షంతో వాహనదారులకు..
మబ్బు పట్టలేదు, గాలి తీయలేదు. అసలు వర్షం వస్తుందని పరిస్థితులు కూడా కనిపించలేదు. కానీ వర్షం పడిన నిమిషాల వ్యవధుల్లోనే రహదారులు చెరువులు, కుంటలను తలపించాయి. రహదారిపై వివిధ వాహనాల్లో ప్రయాణించే వారికి భారీగా కురుస్తున్న వర్షంతో దారి కనిపించకుండా పోయింది. దీంతో వాహనదారులు ఇండికేటర్లను వేసుకొని, ముందు లైటు వెలిగించుకొని ప్రయాణం చేయాల్సి వచ్చింది. భారీగా కురుస్తున్న వర్షంతో రహదారిపై గుంటలు, ఇతర ప్రయాణ సూచికలు కనిపించకుండా పోయాయి. దీంతో వాహనాలు నడిపే వారంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
Also Read: Mahabubabad District: గంజాయి మత్తులో లారీ డ్రైవర్లపై దాడి.. వాహనాలు ఆపి బెదిరింపులు.. ఎక్కడంటే?
రోడ్డు పక్కన నిలిపి
కొంతమంది వాహనదారులు రోడ్డు పక్కన నిలిపి వర్షం వెలిశాక ప్రయాణం సాగించారు. మహబూబాబాద్ జిల్లా నుండి ఇతర జిల్లాలకు వెళ్లే నలువైపుల రహదారులపై ప్రయాణించే వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు తప్పలేదు. రహదారిపై మార్గం కనిపించకపోవడంతో నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటల సమయంలోనే వాతావరణ శాఖ మెదక్(Medak), సిద్దిపేట(Sidhipeta), మహబూబాబాద్(Mehabubabad), వికారాబాద్(Vikarabad), సంగారెడ్డి(sangareddy), కామారెడ్డి(kamaredddy), నిజామాబాద్(Nizamabad), జగిత్యాల్(jagithyal), రంగారెడ్డి(Rangareddy), నల్గొండ(Nalgonda), ఖమ్మం(Khammam), భద్రాద్రి, కొత్తగూడెం(Kothagudema0, వరంగల్(Warangala) జిల్లాలో రెండు గంటలపాటు వర్షపాతం ఉంటుందని సూచనలు చేసింది. వాతావరణ శాఖ చెప్పిన విధంగానే మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి.
Also Read; Wine Mart: మందుబాబులకు గుడ్ న్యూస్.. అనంతగిరిలో వైన్ మార్ట్..!