National Highwa( iMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: గంజాయి మత్తులో లారీ డ్రైవర్లపై దాడి.. వాహనాలు ఆపి బెదిరింపులు.. ఎక్కడంటే?

Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తొర్రూరులో అర్ధరాత్రి ఘోర ఘటన చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ముగ్గురు యువకులు లారీ డ్రైవర్లపై దాడి చేసి హైవేపై(National Highway) గందరగోళం సృష్టించారు. ఈ ఘటనలో ఒక డ్రైవర్నీ గాయపరిచి, రెండు లారీల అద్దాలు పగలగొట్టారు.

 Also Read: Tribal Ashram School: ఆశ్రమ స్కూల్ లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న హెడ్మాస్టర్!

వాహనాలు ఆపి బెదిరింపులు

హైదరాబాద్‌(Hyderabad) ఉప్పల్‌ చిలుకానగర్‌కు చెందిన తోల్ల అభిలాష్‌ తన క్లీనర్‌తో కలిసి డిసిఎం వాహనంలో స్పేర్ పార్ట్స్‌తో ఝార్ఖండ్‌ వెళ్తుండగా,మహారాష్ట్ర నుంచి నూజివీడుకు కోళ్ల దాణా తీసుకెళ్తున్న పెద్దపాటి రాంబాబు కూడా అదే రహదారిలో ప్రయాణిస్తున్నాడు.అయితే తొర్రూరు పట్టణంలో రాత్రి రెండు గంటల సమయంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి దుబ్బతండా వద్ద ముగ్గురు యువకులు వాహనాలను అడ్డగించి డ్రైవర్లను లైసెన్స్, పర్మిట్ చూపాలని, లేకుంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించాగా డ్రైవర్ రాంబాబు తిరస్కరించడంతో యువకులు రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం లారీ అద్దాలను పగలగొట్టి హడావిడి చేశారు.

డ్రైవర్లు భయంతో మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి 100 నంబర్‌కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే తొర్రూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు అని పోలీసులు తెలిపారు.పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ..తొర్రూరు మీదుగా ఎన్నోసార్లు ప్రయాణించాం,ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు,గంజాయి మత్తులో దాడి చేసి మా వాహనం ధ్వంసం చేశారు. మాకు న్యాయం జరగాలి అని డ్రైవర్లు వాపోయారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 Also Read: Apple iPhones: ఐఫోన్ 15,16 సిరీస్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 20,000 తగ్గింపు

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!