Medak Heavy Rains: గత మూడు రోజులుగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల (Medak Heavy Rains) కారణంగా వాగులు, వంకలు చెరువులు కుంటలు, ప్రాజక్ట్ లు పొంగి పోరులుతున్నాయి. దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ( Heavy Rains)తో సింగూరు ప్రాజెక్టు కు బారీ స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు దిగువకు మంజీర నదిలో కి 1లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 14 గేట్లు త్తడంతో మంజీర ఉగ్రరూపం దాల్చడంతో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం జలదిగ్బంధం లో చిక్కుకుంది. దుర్గామాత అమ్మవారి పాదాలను తాకుతూ మంజీర ఉదృతంగా ప్రవహిస్తుంది. సంగారెడ్డి,మెదక్ (Medak) జిల్లాలో సుమారు 90 కిలోమీటర్లు మంజీర ప్రవహించి,ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా లో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజక్టు కు నీరు చేరుకుంటుంది.అక్కడి నుంచి దిగువకు నీటిని వదులుతున్నారు.
Also Read: Warangal District: ఈఎస్టీఐసి-2025 ప్రతిష్టాత్మక సదస్సుకు.. వరంగల్ వాసి ఎంపిక!
గత 3 నెలల నుంచి వర్షాలు కురవడంతో మంజీర నది నీరు లక్షల క్యూసెక్యుల నీరు వృథాగా పోతుంది.ఈనిటిని వృథాగా పోకుండా ఉండాలంటే ఉమ్మడి,మెదక్,ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో మరో ప్రాజక్టు నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని ఈ ప్రాంత రైతాంగం కోరుతుంది.వృథాగా పోయి సముద్రంలో కలిసే నీటిని ఒడిసిపట్టి 20 టి ఎం సి ల నీటిని పొదుపు చేసే ప్రాజెక్టుకు రూపకల్పన చేసి రైతుల (Farmers)కు ఉపయోగ పడే విధంగా నిర్మించాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రైతులకు తీవ్ర నష్టం
ఇదిలా ఉండగా మంజీరా నది ఉగ్రరూపం దాల్చడంతో నదీ పరివాహక ప్రాంతంలో ఇరుపక్కల రైతులు వేసిన వరి పంట నీట మునిగింది.పంటలు చేతికి వస్తున్న సమయంలో వర్షాలు రైతుల (Farmersకు తీవ్ర నష్టం కలిగించింది. మెదక్ జిల్లా (Medak District) పేరూరు,ఎల్లాపూర్ బ్రిడ్జిపై పై మంజీర నీరు ప్రవహిస్తుండడంతో మెదక్, బొడుమటి పల్లి వైపు వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. నారాయణఖేడ్ పిట్లం తదితర ప్రాంతాలలో సైతం రాకపోకలు బంద్ అయ్యాయి.జాతీయ రహదారి పై వరద నీరు ప్రవహించడంతో అధికారులు వాహనాల రాకపోకలు నిలిపి వేశారు.
ఏడుపాయల రహదారుల మూసివేత!
మంజీరనది (Manjira) ఉగ్రరూపం దాల్చడంతో నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహించడంతో ఏడుపాయల, వన దుర్గామాత ఆలయం జలదిగ్బంధం లోనే ఉంది.ఏడుపాయల దుర్గామాత ఆలయం కు వెళ్ళే అన్ని దారులు అధికారులు మూసివేశారు.పోతాంశాట్పల్లి వైపు పోలీస్ అధికారులు బారికేడ్ లు ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎల్లాపూర్ పేరూరు బ్రిడ్జి పై నీరు ప్రవహించడంతో అక్కడ బారికేడ్ ల తో రహదారిని మూసివేశారు. దీంతో ఏడుపాయలకు వెళ్లే రహదారులన్నీ మూసుకుపోయాయి. వర్షాలు తగ్గుతేనే దుర్గామాత దర్శనాన్ని భక్తులు చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా భారీ వర్షాలకు హవేలీ ఘన్పూర్ మండలం దూప్ సింగ్ తండా రోడ్డు కొట్టుకుపోయింది దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకుంటున్నారు. రెండు జిల్లాల్లోని జాతీయ రహదారుల పై వర్షాలతో ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు,వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు