Warangal District: నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ప్రాపెసర్ స్థాయికి ఎదిగిన హనుమకొండ జిల్లా కమలాపూర్ కు చెందిన డాక్టర్ పుల్ల సమ్మయ్య(Dr. Pulla Sammaya) ఈఎస్టీఐసి-2025 (Emerging Science, Technology and Innovation Conclave (ESTIC-2025) ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రభుత్వము ఎంపిక చేసింది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తుల మీదుగా ప్రారంభించనున్న ఈ సదస్సు 2025 నవంబర్ 3 నుండి 5 వరకు న్యూఢిల్లీలోని భారత్ మందపంలో నిర్వహించనున్నారు.
ఇంజినీరింగ్ విభాగంలో నూతన పరిశోధనలు ఆధునిక పదార్థాలు, కంపోజిట్లు, మరియు సాంకేతిక ఆవిష్కరణలలో డాక్టర్ పుల్ల సమ్మయ్య చేసిన విశేష కృషిని గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఈ సదస్సుకు ఎంపిక చేసింది. ఆయన సీనియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ లీడర్స్(Senior Science and Technology Leaders) (45 సంవత్సరాల పైబడిన వర్గం) విభాగంలో ఎంపిక చేయబడ్డారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, టెక్నోక్రాట్లు, ఆవిష్కర్తలు పాల్గొననున్నారు. ముఖ్యంగా, ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ వేదిక ద్వారా శాస్త్రసాంకేతిక రంగంలో కొత్త ధోరణులను ఆవిష్కరించడంతో పాటు, ఆవిష్కరణలలో భారత్ ముందడుగు వేస్తున్న తీరును ప్రదర్శించనున్నారు.
Also Read: Telangana Politics: బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని బండి సుధాకర్ డిమాండ్
అంకిత భావానికి ప్రతిక
ఈఎస్టీఐసి-2025 సదస్సుకు ఎంపిక అయిన డా. పుల్ల సమ్మయ్య ప్రస్తుతం వరంగల్(Warangal) అనంతసాగర్ ఎస్ ఆర్ యూనివర్సిటీ(SR University)లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(Research and Development) విభాగంలో డీన్ గా పని చేస్తున్నారు. సదస్సుకు ఎంపిక ఆయన జ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, దేశ సాంకేతిక ప్రగతికి చేయూతనివ్వడం పట్ల ఉన్న అంకితభావానికి ప్రతీకగా నిలుస్తోందని సదస్సు నిర్వహిస్తున్న భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం అధికారులు ఎంపిక పత్రంలో పేర్కొనడం గమనార్హం.
జీవితంలో నాకు లభించిన గొప్ప అవకాశం
నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను నా తల్లిదండ్రుల కష్టంతో ఉన్నత విద్యను అభ్యసించి యూనివర్సిటీలో ప్రాపెసర్ గా పని చేస్తూ కొత్త ఆవిష్కరణ వైపు విద్యార్థులను సన్నద్ధం చేస్తూ వారిని దేశ సాంకేతిక అభివృద్ధిలో భాగస్వాములను చేసే ప్రయత్నం సాగిస్తున్న నాకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వారు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తలతో నిర్వహించే ఈఎస్టీఐసి-2025 సదస్సుకు కేంద్ర ప్రభుత్వం నన్ను ఎంపిక చేయడం జీవితంలో నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా అన్నారు.
Also Read: Anil Ravipudi: ‘భూతం ప్రేతం’కు అనిల్ రావిపూడి సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?