Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు కు రాంరాం పెడుతుందని మాజీ సీఎం కేసిఆర్ ఎన్నికల ముందే చెప్పారని ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ లతో ఆశలకు పోయి తెలంగాణ ప్రజలు భంగపడ్డారని స్థానిక ఎన్నికల తరువాత రైతు బంధును కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేస్తుందని, 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 48 వేలకోట్లు రుణమాఫీ చేస్తామని 36 వేలకోట్లు బడ్జెట్ పెట్టీ అందులో కేవలం 21 వేలకోట్లు రైతుల రుణమాఫీకి ఖర్చు చేశారని ఇంకా సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదనీ వ్యవసాయ శాఖ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని, మెదక్ ఉమ్మడి జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టు ల నుండి ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయాలని, డిమాండ్ చేస్తూ రైతులతో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తో పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎమ్మేల్యేలు సునీతా లక్ష్మా రెడ్డి(Sunitha Laxma Reddy), కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు పద్మా దేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, సుభాష్ రెడ్డిలు పాల్గొన్నారు.
బండి సంజయ్ కౌంటర్ ఇస్తున్నారా
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ పార్టీ లు బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని అన్నారు. రాష్ట్ర బిజెపి నాయకులు మోడీ(Modhi) వైపు ఉన్నారా రేవంత్(Revanth) వైపు ఉన్నారా తేల్చుకోవాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ వెంకటరమణారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, తప్ప బిజెపి పార్టీ మొత్తం రేవంత్ రెడ్డి కు వత్తాసు పలుకుతుందని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి నీ విమర్శిస్తే బండి సంజయ్ కౌంటర్ ఇస్తున్నారని ఆరోపించారు. మోడిని దించుతాం మని రేవంత్ రెడ్డి అనడంపట్ల బిజెపి ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ బిజెపిలో మీలాకత్ అయ్యాయని ఆయన ఆరోపించారు మోడీ రేవంతులు కేసీఆర్ పై ఒంటికాలతో లేస్తున్నారని విమర్శించారు గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపిలో పరస్పరం సహకారం చేసుకునే అని అన్నారు.
Also Read: Congress vs BRS: నిజానిజాలపై కొనసాగుతున్న పొలిటిరల్ రచ్చ!
రెండింతలు చేస్తామని బిజెపి మోసం
బిజెపికి రైతుల మీద ప్రేమ లేదని ఆ పార్టీ వ్యాపారస్తుల పార్టీ అని అన్నారు మతం మీద రాజకీయాలు చేస్తున్న పార్టీ బిజెపి అని విమర్శించారు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని బిజెపి(BJP) మోసం చేసిందన్నారు దాటిన రైతులకు పింఛన్లు ఇస్తామని చెప్పి ఇవ్వని పార్టీ బిజెపి అన్నారు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని బిజెపి మోసం చేసిందని విమర్శించారు కాంగ్రెస్, బిజెపి, ఒకవైపు ప్రజలు బి ఆర్ఎస్ వైపు ఉన్నారని నిరంజన్ రెడ్డి చమత్కరించారు. తెలంగాణలో 600 మంది రైతులు హత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.స్థానిక సంస్థల ఎన్నికల తరువాత రైతుబంధును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎత్తివేస్తుందని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.
6 నెలల ముందు కేంద్రంతో మాట్లాడాలి
ఎరువులకోసం రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టీ లైన్ కట్టే పరిస్తితి తెలంగాణ(Telangana)లో నెలకొందని మండి పడ్డారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అని విమర్శించారు. ఎరువులను6 నెలల ముందు కేంద్రంతో మాట్లాడి తెచ్చుకోవాలని అన్నారు.కేసీఆర్(KCR) పాలనలో ఎరువుల కొరత,విద్యుత్ కొరతలు లేకుండా చూశారని అన్నారు. కృష్ణా(Krishna), గోదావరి(Godhvarai) నీళ్లు గంగలో కలుస్తున్నాయి అని అన్నారు. కాంగ్రెస్ తో ఉండే ప్రమాదం, ప్రజలకు చెప్పాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలి వేశారు, అధికారులతో ప్రతి పక్షాలను అణిచి వేస్తున్నారని దుయ్యబట్టారు. ఐఏఎస్ లు అధికార పార్టీ కి అడుగులకు మడుగులు ఒత్తొద్దని అన్నారు.కే సీ ఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు 72 వేల కోట్లు రైతు బంధు ఇచ్చామని అన్నారు.
Also Rerad: MLC Kavitha: బీసీలను మోసం చేస్తున్నారు.. బీజేపీ కాంగ్రెస్‌లపై మండిపడ్డ కవిత
దర్ననుంచి వెళ్ళి పోయిన హరీష్ రావు!
హరీష్ రావు కేవలం 30 నిమిషాలు మాత్రమే సభ లో ఉండి రైతుల రుణమాఫీకి కానీ వారి జాబితాను ధర్నాలో ప్రదర్శించి. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ కానీ రైతుల కు వెంటనే రుణమాఫి చేయాలని డిమాండ్ చేశారు. సగం మంది రైతుల(Farmers)కు రుణమాఫీ కాలేదనీ హరీష్ రావు అన్నారు.ఫామ్ హౌస్ నుంచి ఫోన్ రావడంతో హరీష్ రావు వెళ్ళిపోయారు. దీంతో ధర్నాను నిరంజన్ రెడ్డి లీడ్ చేశారు.
మంత్రులపై గాటు వ్యాఖ్యలు చేసిన కొత్త!
మహా ధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి9Uttam Kumar Reddy) వెస్ట్ మంత్రి అని ఆయన ఒక్క రోజు కూడా సాగునీటి ప్రాజెక్టు లపై రివ్యూ చేయడం లేదన్నారు.మంత్రులు, ఇంచార్జి మంత్రి కమిషన్ల కోసం గ్రూపులు కట్టి లొల్లి పెట్టుకున్నారని ఆరోపించారు. 3 రోజుల్లో ఉమ్మడి జిల్లాలో నీ సాగునీటి ప్రాజెక్టులలో నీటిని రైతులకు విడుదల చేయకుంటే రైతులతో వచ్చి గేట్లు బద్దలు కొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులు ఎస్కార్టిస్తున్నారని ఎమ్మెల్యేలకు మాత్రం ఎస్ తాటి ఇవ్వడంలేదని పోలీసు అధికారులను విమర్శించారు.నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ ఘనపూర్ ప్రాజెక్టు నించి రైతులకు హక్కుగా రావలసిన నీటిని విడుదల చేయాలని లేకుంటే రైతులతో కలసి నిరసన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి9Padma Devender Reddy) మాట్లాడుతూ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కిందని అన్నారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, బట్టి జగపతి, మల్లికార్జున్ గౌడ్, చంద్ర గౌడ్, సోములు, మామిల్ల ఆంజనేయులు, జితేందర్ గౌడ్, పుట్టి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, తదితరులు ప్రసంగించారు.
అదనపు కలెక్టర్ కు వినతి పత్రం
రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని, ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. గుబులురేపుతున్న వార్నింగ్స్.. ఇక అంతా జలమయమేనా!
