Congress vs BRS: ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అటూ బీఆర్ఎస్ పార్టీ రెండు సైతం తాము చెప్పిందే కరెక్టు అని పేర్కొంటున్నాయి. అసలు ఎవరు చెప్పింది వాస్తమో తెలియక ప్రజలు సైతం డైలామాలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో సహా చెబుతుంది. దీంతో నిజమే అనిపిస్తుంది. మళ్లీ అదే అంశాన్ని బీఆర్ఎస్(brs)నేత హరీష్ రావు(Harish rao) చెబితే అదినూ కరెక్టు కావొచ్చేమో అని ప్రజలు ఆలోచన పడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టు నిర్మించారని మంత్రి ఉత్తమ్ పేర్కొంటుండగా ఉందని హరీష్ రావు అంటున్నారు. ఇంతకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుందా? లేదా? అనేది ఇప్పడు సగటు వ్యక్తికి ప్రశ్నగా మారింది.
Also Read: Drug Peddlers Arrested: డ్రగ్ పెడ్లర్ అరెస్ట్.. 21కిలోల పాపీ హస్క్ సీజ్
గత రెండేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS) పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఒకరిపై విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు-ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ రాకున్నా ఎన్నికలను తలపించేలా రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)కు ఖర్చు లక్షకోట్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటుంది. అయినా ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని, ఇంకా 20 నుంచి 40వేల కోట్లు అవుతుందని పేర్కొంటుంది. బీఆర్ఎస్ మాత్రం 94వేలకోట్లు అని పేర్కొంటుంది. అయితే ప్రాజెక్టు అంచనా వ్యయంను రెండుసార్లు పెంచారు. చివరికి రూ.1,10,248.48 కోట్లకు పెంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ.1.47లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేసింది. ఇంతకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పదని మంత్రి ఉత్తమ్ పేర్కొంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)కు అనుమతులు లేవని, కేబినెట్ ఆమోదం లేదని, డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టారని ప్రభుత్వం పేర్కొంటుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 ఏజెన్సీల అనుమతులు ఉన్నాయని కావాలని ప్రభుత్వం ఆరోపణలు చేస్తుందని హరీష్ రావు పేర్కొంటున్నారు. మరోవైపు తమ్మిడిహట్టివద్దప్రాజెక్టు నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, తట్టెడు మట్టి కూడా తవ్వకుండానే అడ్వాన్సుల పేరిట 1052కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
రూ. 2 వేల కోట్లు
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నీటి లభ్యత ఉందని, ప్రాజెక్టు నిర్మిస్తే 38వేలకోట్లతోనే ప్రాజెక్టు పూర్తి అయ్యేదని, కూలిపోయేది కాదని ప్రజలపై ఆర్ధిక భారం పడేది కాదని పేర్కొంటుంది. ప్రాజెక్టుకు అనుమతి కూడా ఉందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు కోసం 11వేలకోట్లు ఖర్చుచేసామని కాంగ్రెస్ పేర్కొంటుంది. ప్రాణహిత చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతి ఇచ్చినదన్నారు. కానీ బీఆర్ఎస్(BRS) మాత్రం ప్రాణహిత-చేవెళ్లలో పెట్టిన ఖర్చు రూ. 3,700 కోట్లు మాత్రమేనని, రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశామని ఉత్తమ్ చెబుతున్నాడని, మొబిలైజేషన్ అడ్వాన్లు పేరుమీద రూ. 2 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తుంది. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీనే చెప్పిందన్నారు. నీటి లభ్యత లేదని ఉమాభారతి అదే లేఖలో మరో పేరాలో పేర్కొన్నారన్నారు.152 మీ. ఎత్తులో బ్యారేజీ నిర్మించవద్దని మహారాష్ట్ర స్పష్టంగా చెప్పిందని, ప్రాజెక్టు పూర్తి కావాలన్న ఉద్దేశంతోనే తమ్మిడిహట్టి నుంచి మార్చాం స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యం లేదు. అన్ని అంశాలు డీపీఆర్ లు ఉన్నాయన్నారు.
పరిగణలోకి తీసుకుందా? లేదా?
మేడిగడ్డ బ్యారేజీ రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారని ప్రభుత్వం పేర్కొంటుండగా, రిటైర్డ్ ఇంజనీర్ల ఏరియల్ సర్వే ఆధ్యయనం అనంతరం బ్యారేజీ నిర్మాణానికి అనువైన ప్రదేశమని నివేదికలో స్పష్టం చేసినట్లు బీఆర్ఎస్(BRS) పేర్కొంటుంది. ఇంజనీర్ల సూచనమేరకు మేడిగడ్డ-మిడ్ మానేరు మార్గాన్ని మార్చి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి బ్యారేజీకి నీటిని గోదావరి మార్గంలో తరలించాలని, ఈ క్రమంలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఏర్పాటు చేసి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించాలని బీఆర్ఎస్(Brs) ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించింది. కాళేశ్వరం కమిషన్ కు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన అఫిడవిట్ లో స్పష్టంగా ఉందన్నారు. నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా? లేదా? అన్న విషయాన్ని కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు వెల్లడించలేదని మంత్రి ఉత్తమ్ పేర్కొనగా, మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా నీటిని తరలించలేమని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను పరిగణలోకి తీసుకొని మేడిగడ్డ నుంచి నదీ మార్గంలో నీటిని తరలించాలని నిర్ణయించామని హరీష్ రావు తెలిపారు.
మేడిగడ్డకు కేబినెట్ అప్రూవల్ లేదని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వాప్కోస్ డీపీఆర్, హై కమిటీ సిఫార్సులు లేవని కేవలం నాటి సీఎం కేసీఆర్,( KCR) ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయం ఉందని, సీడబ్ల్యూసీ ఆమోదం మేరకు జరిగాయని, బ్యారేజీల నిర్మాణం వ్యక్తుల నిర్ణయం అనేది అబద్దమని, రాజకీయ దురుద్దేశంతో కూడిన కుట్రపూరిత ఆరోపణలు అని హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ ప్రతిపాదనలను రిజల్యూషన్ 347 ద్వారా 2016జూన్ 16న మంత్రి వర్గం ఆమోదించిందన్నారు.
Also Read: Sc on Medical Colleges: మెడికల్ కాలేజీ అడ్మిషన్లపై సుప్రీంలో విచారణ
మేడిగడ్డ బ్యారేజీనిర్మాణానికి రెండుసార్లు కేబినెట్ తో పాటు శాసనసభ ఆమోదం ఉందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. గవర్నర్ ప్రసంగంలో కూడా కాళేశ్వరం అంశం ఉందని, అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ సీఎం కేసీఆర్ ఇచ్చారన్నారు. వాప్కోస్ సంస్థ 71436కోట్ల అవుతుందని ప్రధానమంత్రికి లేఖను 2016 పిబ్రవరి 11 న రాశారని ఉత్తమ్ పేర్కొనగా, జాతీయ ప్రాజెక్టు హోదా సాధించేందుకు 15శాతం ప్రాజెక్టు కాస్ట్ ఎస్కలేషన్ అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టు కాస్టు రూ.71436 కోట్లు అని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నామని బీఆర్ఎస్ పేర్కొంటుంది.
మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలు
నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలోబీఆర్ఎస్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, కమీషన్ల కక్కుర్తితో తెలంగాణకు శాశ్వత నష్టం జరిగిందని ప్రభుత్వం పేర్కొంటుంది. ఫరక్కా బ్యారేజీని నీటి మళ్లింపు కోసం నిర్మిస్తే.. కాళేశ్వరం బ్యారేజీలు కట్టింది నిధులు మళ్లింపు కోసమని ఆరోపించారు. ఐదేళ్లలో మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలు అన్నారు. ఇందులో వరదలు రాగానే సముద్రంలోకి వదిలిన నీరు 63 టీఎంసీలు అన్నారు. ఐదేళ్లలో 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తుంది.
అసలు ప్రాజెక్టును నిర్మించింది 37లక్షల ఎకరాలకు నీరిందించే లక్ష్యం. కాళేశ్వరం అన్ని పంపులు నడిచినప్పుడు విద్యుత్ భారమే ఏడాదికి రూ.10వేల కోట్లు అయ్యేవి అని, తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుకట్టి ఉంటే విద్యుత్ భారం కేవలం వెయ్యికోట్లు అయ్యేదని అభిప్రాయపడుతుంది. తమ్మిడి హెట్టి బ్యారేజీ ప్రాజెక్టు రూ.38వేల కోట్లతో పూర్తై ఇప్పటికే తమ్మిడి హెట్టి నుంచి చేవెళ్ల దాకా 17లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందేదని ప్రభుత్వం పేర్కొంటుంది. బీఆర్ఎస్ లక్షకోట్లతో కాళేశ్వరం నిర్మిస్తే, తమ్మిడిహెట్టి దగ్గర నిర్మిస్తే 62కోట్లు ఆదా అయ్యేది. బీఆర్ఎస్ కమీషన్ల కక్కుర్తి తో తెలంగాణ ప్రజలు నీటిపారుదలకు తీసుకున్న అప్పులకు ఏటా 16వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని ఈ వడ్డీల భారం తెలంగాణ ప్రజలపై పడటానికి కేసీఆర్ కారణమని పేర్కొంటుంది.
ఎకరాకునీరందించాలంటే రూ. 21,810
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Projectతో సుమారు 140 టీఎంసీల నీటిని తరలించినట్లు అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. మొత్తం రూ.3600కోట్లు విద్యుత్ బిల్లులు వచ్చాయి.అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకమ్మ సాగర్ లకు నీళ్లను ఎత్తిపోయడానికి మూడేళ్లలో మొత్తం 866.21కోట్ల విద్యుత్ బిల్లులు వచ్చాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క టీఎంసీ నీటిని తరలించేందుకు రూ.25.71కోట్లు విద్యుత్ చార్జీ అయింది. ఎకరసాగుకు విద్యుత్ బిల్లుల రూపంలో 21,810 రూపాయలు అయింది. ఇదెలా ఉంటే టా విద్యుత్ బిల్లులకే రూ. 11 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంటుందని కాగ్ తెలిపింది. విద్యుత్ బిల్లులు, రుణాల చెల్లింపులు కలుపుకుంటే.. కాళేశ్వరం కోసం ఏటా రూ.25 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని కాగ్ లెక్కలు వేసింది.
రెండేళ్లు రైతు భరోసా ఇవ్వొచ్చు
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఎకరాకు నీరు ఇవ్వాలంటే 21810 రూపాయలు అవుతుంది. ప్రభుత్వం రాష్ట్రంలోని రైతాంగానికి చేయూత నిచ్చేందుకు చేపట్టిన రైతు భరోసా పథకం చేపట్టింది. ఈ పథకంలో ఎకరాకు 6వేలు ఇస్తుంది. అంటే ప్రాజెక్టుకింద నీరు ఇచ్చే డబ్బులతో రైతు భరోసా రెండేళ్లు ఇవ్వొచ్చని అధికారిక లెక్కలె చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం ప్రభుత్వానికి గుదిబండగా మారిందనేది స్పష్టమవుతుంది.
తలకు మించిన భారంగా అప్పు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి తెచ్చిన అప్పు తలకుమించిన భారమవుతోంది. తెచ్చిన అప్పుకన్నా వడ్డీ ఎక్కువైంది. ప్రాజెక్టుకు రుణాల పేరుతో కే.ఐ.పీ.సీ.ఎల్ సంస్థ వద్ద ప్రభుత్వ హామీతో రూ.87,449 కోట్లు అప్పులను గత కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ఆ అప్పునుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 29,737 కోట్లు చెల్లించింది. ఇంకా చెల్లించాల్సిన అసలు 64,212 కోట్లు ఉంది. దానితో పాటు ఇంకా 41,638 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఇంకా చెల్లించాల్సింది 1,05,850కోట్లు. అసలు ప్రభుత్వం తెచ్చిన అసలు కన్నా వడ్డీతో కలిపితే తడిసిమోపడైంది.
Also Read: UP Crime: ప్రియుడితో ఎఫైర్.. భర్తను కత్తితో పొడిచి.. యాసిడ్ పోసి భార్య హత్య!