MLC Kavitha: బీజేపీ కాంగ్రెస్‌లపై మండిపడ్డ కవిత
MLC Kavitha( IMAGE crdit: swetcha reporter)
Political News

MLC Kavitha: బీసీలను మోసం చేస్తున్నారు.. బీజేపీ కాంగ్రెస్‌లపై మండిపడ్డ కవిత

MLC Kavitha: సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తుందని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha:)ప్రకటించారు. సాంస్కృతిక విప్లవంతో పాటు సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రొఫెసర్ జయశంకర్(Professor Jayashankar) స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధనకు ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. బంజారాహిల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ జాగృతి ఆవిర్భావ ఉత్సవాలు, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ని నిర్వహించారు.

Also Read: Cyber Fraud: రూ.260 కోట్ల మోసం.. సైబర్​ ఫ్రాడ్ కేసులో స్పీడ్ పెంచిన ఈడీ

తెలంగాణ ధ్యేయంగా ఉండాలి

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసం, బీసీల కోసం ఉద్యమం చేస్తానని ప్రొఫెసర్ జయశంకర్ అనేవారని గుర్తు చేశారు. ప్రపంచీకరణ, కార్పొరేట్ల నేపథ్యంలో వృత్తి పనులు కనుమరుగవుతున్న క్రమంలో సామాజిక విప్లవం రావాలని ప్రొఫెసర్ జయశంకర్(Professor Jayashankar) ఆకాంక్షించేవారని, భౌగోళిక తెలంగాణ సాధనతో పాటు సామాజిక తెలంగాణ ధ్యేయంగా ఉండాలని చెప్పేవారని, ఆయన స్పూర్తితో తెలంగాణ జాగృతి పనిచేస్తుందని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెట్టిన ధర్నా కోసమే తన దీక్షను భగ్నం చేశారని ఆరోపించారు. బీసీ బిల్లుల ఆమోదానికి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతిని కలవాలని, గవర్నర్ ఆర్డినెన్సు జారీ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేశారు. ఎటువంటి నిర్దిష్టమైన చర్యలు చేపట్టకుండా ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా బీసీ బిడ్డలను మోసం చేస్తున్నట్లేనని సూచించారు. కాంగ్రెస్ దొంగ ధర్నాలు కాదు.. ఫలితం వచ్చే చర్యలు చేపట్టాలన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీల నోటికాడి ముద్దను లాక్కోడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరికి ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లలో ముస్లీంల రిజర్వేషన్లు ఉన్నారా లేదా అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టత ఇవ్వకముందే అందులో ముస్లీం రిజర్వేషన్లు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఎలా తెలుసు ? అని ప్రశ్నించారు.

 Also Read: CM Revanth protest: పేరు బంధంతో పాటు పేగు బంధం తెంచుకుందాం: రేవంత్ రెడ్డి

బీజేపీ,(BjP)  కాంగ్రెస్(Congress)  పార్టీలకు తెలంగాణ బీసీలు బుద్దిచెబుతారని హెచ్చరించారు. అఖిలపక్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Redd) ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఈ మేరకు అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ సాధన అంటే ఢిల్లీకి పోయి ధర్నాలు చేయడం కాదని, సామాజిక తెలంగాణ అంటే గ్రామ గ్రామాన ప్రతీ ఒక్కరి జీవన శైలిలో మార్పులు తీసుకురావడమన్నారు. తెలంగాణ జాగృతి సంస్థను మరింత బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేయనున్నట్లు వెల్లడించారు.

బూటకపు హామీలు

కరీంనగర్ లో నిర్వహించబోతున్న బీఆర్ఎస్(brs)  బీసీ గర్జన సభకు పిలుపు రాలేదని, వస్తే వెళ్తానని ప్రకటించారు. పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ పై రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడలేదన్నారు. ఢిల్లీలో జరిగే ధర్నాకు హాజరు అవుతాడో లేడో కూడ తెలియదన్నారు. ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం బూటకపు హామీలు.. అబద్ధపు డిక్లరేషన్ లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఢిల్లీ నడివీధుల్లో మరోసారి బట్టబయలు అయ్యిందన్నారు. తెలంగాణ బీసీ బిడ్డలను వరుసగా రెండుసార్లు ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీ(Rahul Gandhi) అవమానించారన్నారు.

42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొనకుండా మొఖం చాటేశారన్నారు. గతంలోనూ బీసీల ఆందోళనకు వెళ్లకుండా అవమానించారని, ఇప్పుడు ట్వీట్ వేసి పత్తాలేకుండా పోయి కాంగ్రెస్ వంచన రాజకీయాలను బట్టబయలు చేశారు.. మోసం మీ పార్టీ నైజమని మరోసారి నిరూపించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ జాగృతి ఆవిర్భావ ఉత్సవాల్లో జాగృతి నాయకులు నవీన్ ఆచారి, సంపత్ గౌడ్, మరిపెల్లి మాధవి, కొట్టాల యాదగిరి, రాము యాదవ్, శ్రీకాంత్ గౌడ్, లింగం తదితరులు పాల్గొన్నారు.

 Also Read: CM Revanth Reddy: రిజర్వేషన్లు ఇవ్వకపోతే మోదీని గద్దె దించుతాం: సీఎం రేవంత్ రెడ్డి

Just In

01

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!