Cyber Fraud ( Image Source: Twitter)
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Cyber Fraud: రూ.260 కోట్ల మోసం.. సైబర్​ ఫ్రాడ్ కేసులో స్పీడ్ పెంచిన ఈడీ

Cyber Fraud: కోట్లాది రూపాయల సైబర్​ ఫ్రాడ్​ (Cyber Fraud)కేసులో ఈడీ అధికారులు (ED Officers) విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బుధవారం దేశంలోని మొత్తం 11చోట్ల దాడులు జరిపి విస్తృత తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్​ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లో ఉంటూ నేరాలు చేస్తున్న ఓ సైబర్ క్రిమినల్స్ గ్యాంగ్ తమను తాము పోలీసు అధికారులమని…మైక్రోసాఫ్ట్, ఆమెజాన్ కంపెనీ టెక్నికల్​ సపోర్ట్ ఏజెంట్లమని నమ్మించి వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఇలా లూటీ చేసిన డబ్బును బిట్ కాయిన్స్​ గా మార్చారు.

Also Read: Tollywood Hero: ‘జయం’ సినిమాకు రిజిక్ట్ చేశారు.. కట్ చేస్తే, ఇప్పుడు పాన్‌ ఇండియా ఆ హీరోకి దాసోహం!

అనంతరం అమెరికన్ డాలర్లుగా మార్చి హవాలా ద్వారా యూఏఈకి  (UAE money trail)చేర్చారు. ఇలా కొల్లగొట్టిన డబ్బుతో సైబర్ క్రిమినల్స్​ 260 కోట్ల రూపాయల ఆస్తులు సమకూర్చుకున్నట్టుగా దీనిపై కేసులు నమోదు చేసిన సీబీఐ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ గ్యాంగ్ భారత్ తోపాటు మరికొన్ని దేశాల్లో కూడా మోసాలు చేసినట్టుగా తేలింది. సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈ మోసాలపై ఈడీ అధికారులు (ED raids )కూడా ఈసీఐఆర్​ జారీ చేశారు. నగదు తరలింపులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్​ (Money laundering) జరిగినట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే బుధవారం ఢిల్లీ, నొయిడా, గురుగావ్​, డెహ్రాడూన్ లలో మొత్తం 11చోట్ల దాడులు జరిపారు. తనిఖీలు జరిపి డిజిటల్​ ఆధారాలు, కీలక డాక్యుమెంట్లతోపాటు క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించిన ఎవిడెన్స్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. కేసు విచారణ కీలక దశలో ఉందని చెప్పిన ఈడీ అధికారులు దీంట్లో మరిన్ని అరెస్టులు ఉంటాయన్నారు.

Also Read: Urea Supply: లోటు యూరియాను ఆగస్టు నెలతో కలిసి సరఫరాచేయాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?