Agricultural Cooperative Society: సమిష్టి వ్యవసాయ సహకార సంస్థకు సంబంధించిన 1494 ఎకరాల భూమిని 1997 లో అప్పటి ప్రభుత్వం 47 మందిని ఓ సొసైటీగా చేర్చి వారందరికీ భూమిని పంచింది. ఆ సొసైటీలో షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారు దాదాపు 218 మంది సభ్యులుగా చేరి 1494 ఎకరాల్లో ఒక్కొక్కరికి నాలుగు ఎకరాల (4.14) చొప్పున అందించి సొసైటీ ద్వారా అసైన్డ్ పట్టాలను అందించింది. 1997లో ఏర్పడిన సమిష్టి వ్యవసాయ సహకార సంస్థ 2008లో తీసివేయడానికి ఆర్జీలు నిలబడ్డాయి. అందుకు సంబంధించి 2009లో సొసైటీని రద్దు చేసింది. వాస్తవానికి సొసైటీని ఏర్పాటు చేసి అసైన్డ్ పట్టాలను అందజేసిన ప్రభుత్వం సొసైటీని రద్దు చేసిన తర్వాత అసైన్డ్ పట్టాల రైతుల నుండి స్వయంగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ ఏం జరిగింది
అయితే ఆ అసైన్డ్ పట్టాల భూమి ఇప్పుడు ఎవరి చేతుల్లోకి పోయింది? అందులో అసైన్డ్ పట్టాల రైతులు సేద్యం చేసుకుంటున్నారా? సాధ్యం కానీ భూస్వాములు సేద్యం చేసుకుంటున్నారా? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లకు లేదా? రెవెన్యూ వ్యవస్థలో పనిచేసే ఉన్నత స్థాయి అధికారుల నుండి మండల స్థాయి అధికారులకు ఎందుకు లేకుండా పోయింది? అసైన్డ్ పట్టాల భూమి సాగు చేస్తే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన రైతులకు ఆధీనంలో ఉండాలి. లేదంటే ప్రభుత్వానికి తిరిగి చెందాలి. మరి ఇక్కడ ఏం జరిగింది? ఇంత జరుగుతుంటే అధికారులకు ఎందుకు సోయి లేదు. ప్రభుత్వం నుంచి ప్రజలు పన్నులు కట్టే డబ్బులతో నెల నెల జీతాలు తీసుకునే అధికారులకు ప్రభుత్వ భూమిపై ఎందుకు బాధ్యత లేకుండా పోతుంది. అయితే అసైన్డ్ పట్టాలు పొందిన అసైన్డ్ రైతులకు ఈ చట్టంలో అమ్ముకునే రైట్స్ లేదనేది స్పష్టం. చేస్తే వ్యవసాయం చేసుకోవాలి.
Also Read: Konda vs Congress: కొనసాగుతున్న కొండా వర్సెస్ ఎమ్మెల్యేల వార్!
అసైన్డ్ పట్టా భూమి కొనుగోలు చేసి వ్యవసాయం
లేదంటే రెవిన్యూ శాఖ తమ ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలు ఇతరత్రా అవసరాల కోసం వినియోగించుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం అసైన్డ్ పట్టాదారుల నుండి కొద్దో గొప్ప పైకం చెల్లించి కొంతమంది భూస్వాములు ఆ భూములను దక్కించుకొని సేద్యం చేసుకుంటూ జల్సా చేస్తున్నట్లుగా సమాచారం. ఇందులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన ఓ వ్యక్తి 7 ఎకరాలకు కోన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా మరో వ్యక్తి సైతం ఇక్కడ రైతుల వద్ద నుంచి అసైన్డ్ పట్టా భూమి(Assigned land) ని కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అప్పుడు ప్రభుత్వం చేపట్టిన సమిష్టి వ్యవసాయ సహకార సంస్థ(Agricultural Cooperative Society) సొసైటీలో 47 మంది సభ్యులుగా చేరి ఒక్కో రైతుకు నాలుగు ఎకరాల 14 గుంటలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఇందులో 99 శాతం అసైన్డ్ రైతులు అంటే 47 మందిలో 46 మంది దాదాపుగా తమకు వచ్చిన భూమిని అంత భూస్వాములకు అమ్ముకొని వారి అవసరాలను తీర్చుకున్నట్లుగా సమాచారం ద్వారా స్పష్టమవుతుంది.
దాదాపు 1494 ఎకరాలు
ఈ సొసైటీలో ఉన్న అప్పటి అసైన్డ్ పట్టాదారు మంద వెంకటయ్య నుంచి ఆయన కుమారుడు నరసయ్య, నరసయ్య నుండి ఆయన భార్య ఇద్దమ్మ, ఇదమ్మ నుండి ప్రస్తుతం ఆయన కుమారుడు మందకృష్ణ మాత్రమే సొసైటీ కి సంబంధించిన భూమిని సేద్యం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 1494 ఎకరాలకు ప్రస్తుతం ఒక్క రైతు సేద్యం చేసే భూమిని లెక్కిస్తే కేవలం నాలుగు ఎకరాలు మాత్రమే మిగిలిందంటే అధికారుల పనితీరు ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. మరి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Collector Advait Kumar Singh), రెవెన్యూ, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు సదరు 1494 ఎకరాల భూమిని ప్రభుత్వానికి తిరిగి చెందేలా చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డ్ పట్టాల జారీ నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో ఎవరి చేతుల్లోకి ఈ సొసైటీ భూములు వెళ్లాయో చూడాలి.
Also Read: GHMC: సహాయక చర్యల్లో కన్పించని జీహెచ్ఎంసీ.. కర్ణన్ ఫైర్