Konda vs Congress ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Politics

Konda vs Congress: కొనసాగుతున్న కొండా వర్సెస్ ఎమ్మెల్యేల వార్!

Konda vs Congress: ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీనియర్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్​ రెడ్డి, (Revuri Prakash Reddy) నాయిని రాజేందర్ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి, (Yashaswini Reddy) కేఆర్ నాగరాజులు సీఎంను ప్రత్యేకంగా కలిసి జిల్లా అభివృద్ధిపై డిస్కషన్ చేశారు. ప్రత్యేక నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే, జిల్లా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) లేకుండానే వీరు సీఎంను కలవడం ఇప్పుడు చర్చనీయాంశమైనది. జిల్లా అభివృద్ధిపై చర్చించే క్రమంలో తప్పనిసరిగా మంత్రి ఉండాల్సిన అవసరం ఉన్నది.

కానీ కొండా సురేఖ లేకుండానే ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. పైగా, సీనియర్ నేత కడియం శ్రీహరి (Kadiyam Srihari) సారథ్యంలో కలవడం బిగ్ డిస్కషన్‌గా మారింది. జిల్లా డెవలప్‌మెంట్‌పై ఎమ్మెల్యేలు సీఎంను కలిసిన తర్వాత వరంగల్‌లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. మంత్రి కొండా సురేఖకు (Konda Surekha) తెలియకుండానే కలిశారా, ఆమెను ఎందుకు ఆహ్వానించలేదు, ఆమె అందుబాటులో లేరా అనే అంశాలపై క్షేత్రస్థాయిలో డిస్కషన్ జరుగుతున్నది. మంత్రిని కావాలనే పక్కకు పెట్టారనే వాదన కూడా కొందరి నుంచి వినిపించడం గమనార్హం.

 Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..

మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలు

వరంగల్ జిల్లా రాజకీయం కొన్నాళ్లుగా రసవత్తరంగా కొనసాగుతున్నది. కొండా ఫ్యామిలీ ఒక వైపు మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మరో వైపుగా చీలిపోయారు. ఇప్పటి వరకు (Konda Surekha) కొండా సురేఖతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని , (Yashaswini Reddy) కూడా కడియం టీమ్‌లో కనిపించడంతో ఉమ్మడి వరంగల్ (Warangal) పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మంత్రిని ఒంటరి చేయడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ జరుగుతున్నట్లు ఆమె అనుచరులు వాపోతున్నారు.

అయితే, డెవలప్‌మెంట్ విషయంలో మాత్రమే తాము సీఎంను కలిశామని, రాజకీయాలపై ఎలాంటి చర్చ లేదని కడియం టీమ్ ఎమ్మెల్యేల్లో ఒకరు చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి తాము కలిసి కట్టుగా పనిచేస్తామని వివరించారు. అయితే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇరు వర్గాల కాంగ్రెస్ పార్టీ కేడర్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నది. వ్యక్తిగత అంశాలపై ఫైట్ చేస్తూ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని పలువురు క్షేత్రస్థాయి నేతలు ఇరు వర్గాలపై ఫైర్ అవుతున్నారు. ఇది రిపీట్ అయితే స్థానిక సంస్థల్లో నష్టాలు జరిగే ప్రమాదం ఉన్నదంటూ ఓ లీడర్ వివరించారు.

ఎన్ని సార్లు చెప్పినా.. అంతేనా?

గత కొన్ని రోజుల క్రితం ఉమ్మడి (Warangal) వరంగల్ జిల్లాలో మొదలైన వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఈ వివాదానికి చెక్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్, (PCC Chief Mahesh Kumar Goud) క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇప్పటికే మూడు సార్లు సూచించారు. కానీ ఫలితం లభించడం లేదు. ఇరు వర్గాలు సమన్వయంగా పనిచేస్తూనే, వివాదాలకు చెక్ పెట్టామని గాంధీభవన్ సాక్షిగా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు మల్లు రవి ఆదేశాలిచ్చారు. త్వరలోనే ఆ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు.

ఈ లోపే ఆదివారం ఎమ్మెల్యేలంతా ఒక్కటై సీఎంను కలవడం మరోసారి రాజకీయ రచ్చకు తెరలేపింది. మాజీ మంత్రి కడియం కావాలనే ఇలాంటి పాలిటిక్స్ చేస్తున్నట్లు మంత్రి వర్గీయులు స్పష్టం చేస్తుండగా, తనకు అభివృద్ధి తప్ప, ఇతర రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు, రాజకీయ ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదుర్కున్నానని, ఇప్పుడు కొత్తగా చూడాల్సిందేమీ లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చినట్లు సన్నిహితుల్లో ఒకరు తెలిపారు.

 Also Read: ULI: సిబిల్ స్కోర్‌కు చెల్లుచీటీ.. కొత్త విధానం వచ్చేస్తోంది!

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం