GHMC: ప్రతి సంవత్సరం వర్షాకాలం హైడ్రాను ఫికర్ లోకి, జీహెచ్ఎంసీ బే ఫికర్ లోకి నెట్టెసినట్టయింది. సహాయక చర్యల్లో నిత్యం అప్రమత్తం ఉన్నామంటూ, ఎలాంటి పరిస్తితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించటంతో పాటు భారీ వర్షాలు కురిసినపుడు చేపట్టే సహాయక చర్యల వివరాలను ఎప్పటికపుడు వెల్లడించే జీహెచ్ఎంసీ భారీ వర్షాలు కురిసినా, రిలాక్స్ గా ఉంది. వర్షాకాలం సహాయక చర్యలతో తమకేం సంబంధం లేదని, మీ ఫిర్యాదును హైడ్రాకు ఫార్వర్డ్ చేస్తామని జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ 040-21111111 లో సిబ్బంది తేల్చి చెబుతున్నట్లు సమాచారం. వర్షం కురుస్తున్నపుడు రూడ్లపై నీరు నిల్వకుండా ఏర్పాటు చేసిన వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లు శుక్రవారం వర్షానికి తుస్సుమన్నాయి.
స్ట్రక్చర్ లో నీరు నిల్వ అయిన తర్వాత వాటిని సమీపంలోని నాలా, వరద నీటి కాలువల్లోకి నీటిని తోడేసే మోటార్లు ఉన్నట్టుండి తుస్సుమనటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. వర్షాకాలం ప్రారంభంలో సహాయక చర్యల కోసం మ్యాన్ పవర్, మిషనరీ, వెహికల్స్ సమకూర్చుకునేందుకు చేపట్టిన టెండర్ల ప్రక్రియలో జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు భారీ అవినీతికి స్కెచ్ వేసిన విషయం బట్టబయలు కావటంతో ఇకపై వర్షాకాల సహాయక చర్యల బాధ్యతలను మున్సిపల్ శాఖ సెక్రటరీ ఇలంబరితి జీహెచ్ఎంసీ(GHMC)ని తప్పించి, ఆ బాధ్యతలను హైడ్రాకు అప్పగించిన సంగతి తెల్సిందే.
ఈ విషయంలో హైడ్రాకు
ప్రతి వర్షాకాలం సహాయక చర్యలు పేరిట చేతివాటం ప్రదర్శించే జీహెచ్ఎంసీ(GHMC) అధికారులకు ఈ సారి ఆ ఛాన్స్ మిస్ కావటంతో కాస్త అలక చెందినట్లు సమాచారం. హైడ్రా(Hydra)కు వర్షాకాలం సహాయక చర్యల బాధ్యతలు అప్పగించినపుడే, వర్షాకాలం సహాయక చర్యల బాధ్యతలను హైడ్రాకు అప్పగించినా, ఈ విషయంలో హైడ్రాకు జీహెచ్ఎంసీ, జలమండలి, సిటీ ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) సహకరించాలని సదరు ఉత్తర్వుల్లో మున్సిపల్ శాఖ సెక్రటరీ ఇలంబరితి పేర్కొన్నా, జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు బేఖాతరు చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
దీంతో పాటు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమష్టిగా సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశించినా, శుక్రవారం వర్షం కురుస్తున్నపుడు గానీ, కురిసిన తర్వాత గానీ జీహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడా కూడా సహాయ చర్యలు చేపట్టినట్లు గానీ, చర్యల్లో హైడ్రాకు సహకరించాలని దాఖలాల్లేవు. ఫలితంగా నల్లకుంట పద్మానగర్ , ప్యాట్నీ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవహించింది. జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రాకు సహకరించకపోవటంపై కమిషనర్ కర్ణన్ శనివారం అధికారులపై మండిపడినట్లు సమాచారం. ఎట్టి పరిస్తితుల్లో హైడ్రాకు సహకరించాల్సిందేనని, సహకరించని వారిపై చర్యలు తీసుకోనున్నట్లు కూడా కమిషనర్ అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది.
Also Read: Loans to Women: మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ.344 కోట్ల రుణాలు
పెరుగుతున్న దూరం
ఒకప్పుడు జీహెచ్ఎంసీలో అంతర్గత భాగమైన హైడ్రాకు జీహెచ్ఎంసీకి మధ్య దూరం పెరుగుతుందా? అన్న ప్రశ్నకు ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. గత సర్కారు హాయంలో ఈవీడీఎంగా చీలిపోయి, జీహెచ్ఎంసీకి సమాంతరంగా పలు సేవలనందించటంతో పాటు పలు రకాల జరిమానాలు కూడా వడ్డించింది. ఈవీడీఎం మరోసారి రూపాంతరం చెంది ప్రస్తుతం జీహెచ్ఎంసీ విజిలెన్స్, హైడ్రాగా విడిపోయింది. సర్కారు, మున్సిపల్ శాఖ ఆఫీసర్లు ఎన్ని సార్లు ఆదేశించినా, హైడ్రా(Hydra), జీహెచ్ఎంసీ(GHMC)ల మధ్య దూరం పెరుగుతుందే తప్పా, ఏ మాత్రం సమన్వయం కుదరటం లేదు. ఇందుకు నిదర్శనమే హైడ్రా(Hydra) ప్రథమ వార్షికోత్సవాల నిర్వహణ. ఈ వార్షికోత్సవాలకు హాజరు కావల్సిన జీహెచ్ఎంసీ అధికారులు కార్యక్రమంలో అసలు కన్పించలేదు. అసలు హైడ్రా అధికారులు వార్షికోత్సవాలకు జీహెచ్ఎంసీ అధికారులను హైడ్రా ఆహ్వానించిందా? అన్న ప్రశ్నకు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి మౌనమే సమాధానంగా వస్తుంది.
అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్ కర్ణన్
వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండ ముందస్తు చర్యలు తీసుకోవాలని కమీషనర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఉదయం జోనల్ కమిషనర్లు, హెచ్ఓడీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ముఖ్యంగా జోనల్ అధికారులు తమ పరిధిలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమీషనర్, ఇంజనీర్లు ఇతర అధికారులు, తో హైడ్రా, ట్రాఫిక్ పోలీస్, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వాటర్ లాగింగ్ పాయింట్లు, వరదా ముంపు లేకుండా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లు ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నివారణ కు చర్యలు తీసుకోవాలని శానిటేషన్,హెల్త్, అడిషనల్ కమిషనర్లను ఆదేశించారు.
డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో
డెంగ్యూ నివారణ చర్యల్లో భాగంగా ఫ్యాగింగ్, యాంటీు లార్వా ఆపరేషన్ (ఏఎల్ఓ) కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో గల ఇంటిని సర్కిల్ మెడికల్ ఆఫీసర్లు, ఎంటమాలజీ అధికారులతో కలిసి సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫ్లై ఓవర్ లపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, పాత ఫ్లైఓవర్ లను తనిఖీ చేసి నీరు నిల్వగుండా చర్యలు చేపట్టాలని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే కుటుంబాలను అప్రమత్తం చేసి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో ఎప్పటి కప్పుడు. సర్కిల్ స్థాయిలో జాగ్రత్తలు హెచ్చరికలు జారీకి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
Also Read: Team India: నాలుగో టెస్టుకు స్టార్ ప్లేయర్!.. సిద్ధమైన మేనేజ్‌మెంట్?