Jogulamba Gadwal farmers: జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి సాగు చేస్తున్నటువంటి రైతుల(Farmers)పై రోజురోజుకు ఆయా కంపెనీలు, ఆర్గనైజర్ల దోపిడీ పెరిగిపోతున్నదని, ఫెయిల్ సీడ్ విషయంలో పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నారని ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో గొంగళ్ళ రంజిత్ కుమార్(Ranjith Kumar) అన్నారు.
Also Read: Farmers Protest: ఆ జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు.. కలెక్టర్ రావాలని డిమాండ్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
గత నెలలో విత్తనపత్తి రైతుల(Farmers)కు జరుగుతున్న అన్యాయం పట్ల స్పందించిన రైతు సంక్షేమ కమిషన్ జిల్లాకు వచ్చినప్పుడు కలెక్టరేట్ కార్యాలయం లో జరిగిన సమావేశం సందర్భంగా జీవోటి ఫలితాలతో సంబంధం లేకుండా రైతుల(Farmers)కు పేమెంట్ చేయాలని స్పష్టం చేయగా ఆయా కంపెనీలు ఆర్గనైజర్లు 80% పైగా జెనెటిక్ ప్యూరిటీ వచ్చినటువంటి వాటికి పేమెంట్ చెల్లిస్తున్నామని రైతు కమిషన్ ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి
వాస్తవానికి ఇప్పటిదాకా పాస్ అయిన వాటికే కాకుండా 80% పైగా జెనెటిక్ ప్యూరిటీ వచ్చినటువంటి సీడ్ కు కూడా పేమెంటు చేయలేదని అన్నారు. అలాగే కొంతమంది ఆర్గనైజర్లు మరియు సబ్ ఆర్గనైజర్లు నకిలీ ఫెయిల్ లిస్టుని నేరుగా వారే తయారుచేసి వ్యవసాయ శాఖకు ఇస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని ఇటువంటి వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఈ సందర్భంగా గొంగళ్ళ రంజిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చినటువంటి లిస్టును వ్యవసాయ శాఖ కనీసం సంతకము మరియు కంపెనీ ముద్ర లేకుండా మేము ఫలానా కంపెనీ లిస్ట్ ఇస్తున్నామంటే ఏ రకంగా తీసుకుంటున్నారని ప్రశ్నించారు.
ఆర్గనైజర్ల పక్షాన నిలవడం దుర్మార్గం
ఇదో కొత్త రకం దోపిడిని మొదలు పెట్టారని అన్నారు. ఇప్పటికే దశాబ్దాలుగా కంపెనీలు మరియు ఆర్గనైజర్ల చేతుల్లో రైతులు మోసపోయి అప్పుల పాలై భూములు కోల్పోయి ఇంట్లో చదువుకు దూరమై అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఇక్కడి పాలకులు రైతుల(Farmers) పక్షాన కాకుండా కంపెనీల మరియు ఆర్గనైజర్ల పక్షాన నిలవడం దుర్మార్గమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు, ఆలూరు వెంకట రాములు,లక్ష్మన్న నేతన్న,బలిజరాజు,ఎల్లందొడ్డి శివప్ప, బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: HHVM: ‘హరి హర వీరమల్లు’ నుంచి బయటకు రావడానికి అసలు కారణం ఏంటో చెప్పిన క్రిష్!