Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో దారుణం.. స్కూల్ వ్యాన్ బోల్తా
Jogulamba Gadwal (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో దారుణం.. ప్రైవేట్ స్కూల్ వ్యాన్ బోల్తా

Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఆరగిద్ద జ్ఞాన సరస్వతి ప్రైవేట్ స్కూల్(Aragidda Gyan Saraswati Private School) వ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పి పొలంలో దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

స్కూల్ టైమింగ్స్ అనుగుణంగా..

గత రెండు నెలల క్రితం గట్టు మండలంలో స్కూల్ బస్ డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడం వల్ల ఓ వ్యక్తి మరణించాడు. అదేవిధంగా ఐజలో సైతం స్కూల్ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి 2 ద్విచక్ర వాహనాలను ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. జిల్లా మండల కేంద్రాలలో అనేక ప్రైవేట్ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. గ్రామాలలో విద్యార్థులను తమ పాఠశాలలో ఉత్తమ విద్య బోధన పేరుతో అడ్మిషన్లు పొంది మారుమూల గ్రామాల నుంచి సైతం ప్రైవేట్ బస్సులలో విద్యార్థులను తరలిస్తున్నారు. స్కూల్ టైమింగ్స్ అనుగుణంగా సకాలంలో పాఠశాలకు చేర్చేందుకు బస్సు డ్రైవర్లు మితిమీరిన వేగంతో డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.

Also Read: Man Kills Wife: ప్రియుడితో దొరికిన భార్య.. తలలు తెగ నరికి.. బైక్‌కు కట్టుకెళ్లిన భర్త

ప్రమాదాలు జరిగినప్పుడే..

అదృష్టవశాత్తు పలు సంఘటనలు చోటు చేసుకున్న విద్యార్థులకు ఎలాంటి అపాయం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆర్టీవో(RTO) అధికారులు కేవలం ప్రమాదాలు జరిగినప్పుడే తూతూ మంత్రంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బస్సు డ్రైవర్లకు నిరంతరం శిక్షణ, నిఘా, పర్యవేక్షణ ఉండాలని తద్వారా విద్యార్థుల ప్రాణాలకు భరోసా కలుగుతుందన్నారు.

Also Read: Crime News: పనిచేస్తున్న సంస్థకే టోకరా.. కోటిన్నర విలువ చేసే నగలతో పరార్.. ఎక్కడంటే..?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?