Gadwal District: గత సంవత్సరం గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతహౌసింగ్ బోర్డు కాలనీ నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలు(Gold Chain)సు లాక్కెళ్లిన ఇద్దరు చైన్ స్నాచర్ లను గద్వాల టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసారు. శనివారం గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్(Gadwal Police Station) లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్(SI Kalyan) కుమార్ వివరాలు వెల్లడించారు.
సీసీ కెమెరాల ఆధారంగా..
గత సంవత్సరం నవంబర్ నెల 9వ తేదీన పాతహౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన శోభ(Shoba) అనే మహిళ ఇంటి నుండి అయ్యప్ప స్వామి దేవాలయానికి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టౌన్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కర్నూల్ జిల్లాకు చెందిన దూదేకుల షాహిద్ వల్లి, పింజరి దస్తగిరిలుగా గుర్తించారు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం ఇద్దరు నిందితులు కలిసి శుక్రవారం చైన్ స్నాచింగ్ చేసేందుకు గద్వాలకు రాగ సీసిటివి పుటేజ్ ఆధారంగా నల్లకుంట కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
Also Read: Viral Video: పులి వచ్చిందని పోస్ట్ పెట్టాడు.. చివరికి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు, అసలు ఏమైందంటే?
వీడియోల సహాయంతో..
నిందితులిద్దరు ఆన్ లైన్ గేమ్స్(Online Games), బెట్టింగ్(Betting( కు అలవాటు పడి అప్పుల పాలు కావడంతో ఈజీగా డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్ లో వీడియోల సహాయంతో చైన్ స్నాచింగ్ కు పాల్పడేవారని విచారణలో తేలింది. ఇలా దొంగిలించిన బంగారు ఆభరణాలు విక్రయించిన డబ్బులతో జల్సాలు పాల్పడేవారు. నిందితులిద్దరిపై నార్సింగ్, నంద్యాలటౌన్, ఆత్మకూరు, వెల్దుర్తి, శాంతినగర్ తో పాటు గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ల లో చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.1.20లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు.
