Viral Video: లక్నో నగరంలో జరిగిన ఓ ఘటన అందర్ని షాక్ కి గురి చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోలు స్థానికులను భయపెట్టాయి.పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ఇంటి బయటకు రావడానికి కూడా భయపడ్డారు. కొన్ని గంటల పాటు నగరం మొత్తం టెన్షన్‌లో ఉండిపోయింది. నగరంలోని ఆషియానా, రుచి ఖండ్, గోమతి నగర్ ప్రాంతాల్లో చిరుతలు తిరుగుతున్నాయంటూ కొందరు పోస్టులు పెట్టడంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. అయితే, అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయి వెంటనే విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.
పులి వచ్చిందని పోస్ట్.. కట్ చేస్తే జైల్లో ఉన్నాడు?
సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియోలు నిజం కావు. అవి AI తో తయారు చేసిన ఫేక్ క్లిప్స్ అని తేలింది. వీడియోలు నిజమే అన్నట్లుగా ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అధికారులు స్పష్టంగా తెలిపారు. నగరంలో ఎక్కడా చిరుతలు లేవు, వీడియోలు పూర్తిగా ఏఐతో సృష్టించినవే అని. అటవీ శాఖ దర్యాప్తులో కూడా నగరంలో చిరుత పులి జాడ ఏదీ దొరకలేదు. పాదముద్రలు గానీ, దానికి సంబంధించిన ఆనవాళ్లు లేవు. చివరికి ఆ యువకుడు తానే వీడియోలు ఏఐతో సృష్టించి షేర్ చేశానని అంగీకరించాడు. ప్రస్తుతం అతనిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ఈ వీడియోల వల్ల చాలా మంది తమ CCTV ఫుటేజ్ కూడా చెక్ చేశారు. కొందరు తల్లిదండ్రులు భయంతో పిల్లలను స్కూల్‌కు పంపలేదు. పోలీసులు, వన్యప్రాణి అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసినా, ఎక్కడా చిరుతల జాడ కనబడలేదు. దీంతో సోషల్ మీడియాలో కూడా కొత్త చర్చ మొదలైంది. దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్స్ “ఏఐతో వీడియోలు చేయొచ్చు కానీ, బెయిల్ మనీ మాత్రం ఏఐ ఇవ్వదు!” కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ “ఏఐతో తయారైన వీడియో, ఫోటో, ఆడియో ఏదైనా ఉంటే దానికి తప్పనిసరిగా ‘AI generated’ అని డిస్క్లైమర్ ఇవ్వాలి. అప్పుడు ఇలాంటి గందరగోళం తగ్గుతుంది.” అని సలహా ఇస్తున్నారు.
Also Read: Hindu Mythology: అతడి రక్తం భూమి పై పడిన ప్రతి సారి కొత్త జన్మ ఎత్తి పుడుతూనే ఉంటాడా?
నిజం చెప్పినప్పుడు అధికారులు పట్టించుకోరు, అబద్ధం చెప్పినప్పుడు మాత్రం వెంటనే జైలుకి పంపేస్తారు” . ఏదేమైనా, ఈ సంఘటన ఒక పెద్ద పాఠం చెబుతోంది. ఏఐ ను ఎంత వరకు వాడాలో అంతే వాడండి. ఏం కాదులే ఎలా పడితే అలా ఎడిట్ చేసి మానవాళిని దెబ్బ తీసేలా చేస్తే ఇలాంటి చర్యలు తప్పవు. మన చేతిలో ఉన్నంతవరకే సేఫ్, అది ఒక్కసారి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడాలేడు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				