Hindu Mythology: ఇప్పుడున్న యూత్ కి పురాణాలు గురించి ఏం తెలియదు. ఎందుకంటే, వాళ్ళు ఫోనుల్లోనే వారి సమయాన్ని గడుపుతున్నారు. నిజం చెప్పాలంటే పురాణాలు అంటే ఏంటి? ఇది మేము ఎప్పుడూ వినలేదని చెబుతారు. ఏం చేద్దాం కాలం అలా ఉంది. కానీ, మనకీ తెలియని ఎన్నో విషయాల గురించి పురాణాల్లో ఎప్పుడో ప్రస్తావించారు. అలాంటి వాటిలో ఈ కథ కూడా ఒకటి. భయంకరమైన రాక్షసుడిని అమ్మ వారు ఎలా సంహరించారో ఇక్కడ తెలుసుకుందాం..
అమ్మవారికి కోపం తెప్పించిన ఆ రాక్షసుడు ఎవరంటే?
అమ్మవారితో యుద్దం అంటే.. సాక్షాత్ ప్రకృతి కోపం భూమి మీదికి దిగివచ్చినట్టే. ఆ యుద్ధంలో లక్షల సంఖ్యలో రాక్షసులు పాల్గొన్నారు. కానీ వారందరిలో రక్తబీజుడు అనే రాక్షసుడే అత్యంత భయంకరుడు. అతన్ని సంహరించడం అమ్మవారికే కష్టంగా మారింది. కారణం అతనికున్న అసాధారణమైన వరం. కానీ, అందరిలో రక్త బీజుడు అనే రాక్షసుడును చంపడానికి మాత్రం చాలా కష్ట పడింది. అయితే, అతనికున్న వరం వలన ఆ రాక్షకుడుని తొందరగా చంపలేకపోయింది. ఆ వరమేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఆ రక్త బీజుడి రక్తం నేలపై పడిన ప్రతి సారి అక్కడ కొత్త రక్త బీజుడు పుట్టుకొచ్చేవాడు. అయితే, ఆ అమ్మ వారు అతన్ని ఎన్ని సార్లు చంపాలి అనుకున్నా చాలా మంది రక్త బీజులు పుట్టుకొచ్చేవాళ్ళు. అమ్మవారు ఒక క్షణం ఆలోచించి “ఇలా కొనసాగితే ఈ రాక్షసుడు ఎప్పటికీ నశించడు” అని. అప్పుడు ఆ తల్లి శక్తి తన అసలైన రూపాన్ని చూపించాలని నిర్ణయించుకుంది. భూమ్మీద ఎవ్వరూ చూడలేని, క్షణంలోనే చీకటిని ముంచెత్తే భయంకరమైన రూపం ఆమె ఎత్తుకుంది. ఆ రూపమే కాలరాత్రి అవతారం.రాత్రి లాంటి నల్లని రంగుతో భయంకరంగా ఉంటుంది. వెలుగు కొంచం కూడా కనిపించదు. ఆ రాత్రి మొత్తం రాక్షసులతో యుద్ధం చేసి, రక్త బీజుడి తల నరికి వచ్చిన రక్తాన్ని భూమి మీద పడకుండా..దాన్ని తాగేసింది. అలా ఆ రాక్షసుడి శక్తీ మొత్తం పీల్చేసి.. అమ్మవారు సంహారాన్ని పూర్తి చేసింది.
గమనిక: ఈ కథనం భక్తి భావంతో మాత్రమే రాయబడింది. ఇందులో పేర్కొన్న విషయాలు భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక అనుభవాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఎవరికీ భయం కలిగించడం లేదా (అమాయక విశ్వాసం) ప్రోత్సహించడం మా ఉద్దేశ్యం కాదు. దేవాలయ పూజలు, ఆచారాలు, నమ్మకాలు అన్నీ భక్తుల విశ్వాసానికి సంబంధించినవి. వాటిని గౌరవంతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				