Upcoming Telugu Movies: తెలుగు సినీ ప్రేమికులను అలరించడానికి ప్రతీ శుక్రవారం ఏవో ఒక కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. థ్రిల్లర్ సస్పెన్స్, ఫాంటసీ ప్రపంచాల వైభవం, హర్రర్ మూవీస్, రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఇలా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. మరి, వచ్చే వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ గురించి ఇక్కడ చూద్దాం..
వృషభ
మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన వృషభ సినిమా 6 నవంబర్ 2025 న మన ముందుకు రానుంది. యాక్షన్, డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తెలుగు, మలయాళం లో రిలీజ్ కానుంది. మోహన్‌లాల్, సమర్జిత్ లంకేష్, సిద్ధిక్, షానయా కపూర్, జహ్రా ఎస్. ఖాన్, శ్రీకాంత్, రాగిణి ద్వివేది, రామచంద్రరాజు, నేహా సక్సేనా, మ
ది గర్ల్‌ఫ్రెండ్
రష్మిక మందన్న, ధీక్షిత్ శెట్టి కలిసి నటించిన సినిమా ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా 7 నవంబర్ 2025 రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రష్మిక మందన్న, కౌశిక్ మహత, ధీక్షిత్ శెట్టి, మహబూబ్ బాషా నటించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్, వహాబ్ సంగీతాన్ని అందించారు. ధీరజ్ మొగిలినేని, కొప్పినీడి నిర్మాతలుగా ఉన్నారు.
జటాధార
సుధీర్ బాబు పోసాని హీరోగా తెరకెక్కిన సినిమా జటాధార. ఈ సినిమా 7 నవంబర్ 2025 న రిలీజ్ అయింది. దర్శకుడు దర్శకత్వం వహించిన వెంకట్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఉజ్వల్ ఆనంద్, ప్రేరణ అరోరా, నిఖిల్ నందా, శివిన్ నారంగ్ నిర్మాతలుగా పని చేశారు.
ఆంధ్ర కింగ్ తాలూకా
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా 28 నవంబర్ 2025 రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర, మురళీ శర్మ, రావు రమేష్, వీటీవీ గణేష్, రామ్ పోతినేని, సత్య లు నటిస్తున్నారు. మహేష్ బాబు పి. దర్శకత్వం వహించిన ఈ మూవీకి వివేక్ శివ, మెర్విన్ సోలమన్ సంగీతాన్ని అందించారు.
