Minister Azharuddin: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొహమ్మద్ అజారుద్దీన్ (Minister Azharuddin), తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలోని ముస్లిం సామాజిక వర్గ ఓటర్లను దగ్గర చేసుకోవడానికి హస్తం పార్టీ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్ అజారుద్దీన్‌కు సంబంధించిన కొన్ని అంశాలపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ‘మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి దేశం పరువు తీసిన వ్యక్తి నేడు ఏకంగా మంత్రి అయిపోయాడు’ అంటూ ఒక ప్రధానమైన ఆరోపణ మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ మొహమ్మద్ అజారుద్దీన్‌పై ఉన్న ‘మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం’ ఏంటి?, ఎప్పుడు జరిగింది?, ఆయన క్రికెట్ కెరీర్ ఎలా ముగిసింది? వంటి అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
అదిరిపోయే ట్రాక్ రికార్డ్
తెలంగాణ నూతన మంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన మొహమ్మద్ అజారుద్దీన్ అద్భుతమైన అంతర్జాతీయ క్రికెటర్‌లలో ఒకరిగా గుర్తింపుపొందారు. 1984 డిసెంబర్ 31న ఆయన ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్, తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ బాదారు. సిరీస్‌లోని ఆ తర్వాతి మిగతా రెండు టెస్టుల్లో కూడా శతకాలు నమోదు చేసి అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్నారు. అజారుద్దీన్ భారత్ తరపున మొత్తం 99 టెస్టులు, ఏకంగా 334 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. టీమిండియా కెప్టెన్‌గా కూడా చాన్నాళ్లు జట్టుని నడిపించారు. ఆయన సారధ్యంలోని భారత జట్టు 1990-91, 1995 ఆసియా కప్‌లను గెలిచింది. 1996 వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌ను సెమీ ఫైనల్‌కు చేర్చారు. మూడు వరల్డ్ కప్‌లలో భారత జట్టుకు ఆయనే కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ రోజుల్లో వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా ఆయనను పరిగణించేవారంటే, అజారుద్దీన్ ఎంత తోపుక్రికెటరో అర్థం చేసుకోవచ్చు.
2000లో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం
16 సంవత్సరాల సుధీర్ఘ క్రికెట్ అనుభవం ఉన్న మొహమ్మద్ అజారుద్దీన్ కెరీర్ 2000వ సంవత్సరంలో అనూహ్య ములుపు తిరిగింది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం కారణంగా కెరీర్ ముగిసిపోయింది. ఆ ఏడాది భారత్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించింది. టెస్ట్ సిరీస్‌ను 3-2 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. అయితే, ఈ సిరీస్‌కు ముందు రికార్డులు తిరగరాసే ప్రదర్శన చేసిన మొహమ్మద్ అజారుద్దీన్.. దక్షిణాఫ్రికా పర్యటనలో అత్యంత చెత్త ప్రదర్శన చేశారు. కేవలం 28 సగటుతో 112 పరుగులు మాత్రమే చేశారు. ఈ సిరీస్ ముగిసిపోయిన తర్వాత ఎవరూ విధంగా ఆయనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి.
మొహమ్మద్ అజారుద్దీన్ తనకు బుకీలను పరిచయం చేశాడంటూ నాటి దక్షిణాఫ్రికా కెప్టెన్ హ్యాన్సీ క్రోన్యే విచారణలో వెల్లడించాడు. దీంతో, అజారుద్దీన్‌కు పాల్పడినట్టు భావించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపగా, ఈ రిపోర్ట్ ఆధారంగా ఐసీసీ, బీసీసీఐలు 2000 డిసెంబర్ 5న అజారుద్దీన్‌పై జీవితకాల నిషేధాన్ని విధిస్తూ ప్రకటనలు చేశాయి. క్రికెట్‌కు సంబంధించిన ఏ పదవులలోనూ ఆయన ఉండకుండా నిషేధాన్ని కూడా విధించాయి, ఆ విధంగా ఆయన క్రికెట్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడింది. అజారుద్దీన్ తన చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ను 2000 ఆసియా కప్‌లో జూన్ 3న పాకిస్థాన్‌పై ఆడారు. టెస్ట్ మ్యాచ్‌ను కూడా అదే ఏడాది ఆడారు.
Read Also- Hindu Mythology: అతడి రక్తం భూమి పై పడిన ప్రతి సారి కొత్త జన్మ ఎత్తి పుడుతూనే ఉంటాడా?
తనపై విధించిన జీవితకాల నిషేధం అన్యాయమని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన సరైన ఆధారాలు లేకుండానే చర్యలు తీసుకున్నారంటూ 2001 – 2012 వరకు కోర్టులో న్యాయపోరాటం చేశారు. తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని సవాలు చేశారు. పన్నెండేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత, 2012 నవంబర్ 8న ఏపీ హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. బీసీసీఐ విచారణలో సరైన ఆధారాలు లేవని, క్రమశిక్షణా సంఘం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమంటూ అజారుద్దీన్‌పై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, ఈ తీర్పు ద్వారా అజారుద్దీన్‌కు చట్టపరంగా క్లీన్‌చిట్ దక్కింది. కానీ, కానీ అప్పటికే ఆయన క్రికెట్ కెరీర్ ముగిసిపోవడంతో తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు అవకాశం లేకుండాపోయింది. అయితే, ఈ తీర్పు కారణంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేయగలిగారు.
पूर्व क्रिकेटर और वरिष्ठ कांग्रेस नेता #MohammedAzharuddin ने आज तेलंगाना राज्य मंत्रिमंडल में मंत्री पद की शपथ ली।
राज्यपाल जिष्णु देव वर्मा ने हैदराबाद राजभवन में आयोजित समारोह में उन्हें पद और गोपनीयता की शपथ दिलाई। इसके साथ ही मंत्रिमंडल में मंत्रियों की संख्या 16 हो गई है। pic.twitter.com/2REM5RKBu4
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) October 31, 2025

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				