Attack on Women(image CREDIT: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Attack on Women: మహిళపై విచక్షణారహితంగా దాడి.. చిన్నపాటి విషయాలకే ఘర్షణ

Attack on Women: గద్వాల న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ మహిళపై నలుగురు దాడికి పాల్పడ్డ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు సుధ తెలిపిన వివరాల ప్రకారం ఇంటి పక్కల మొక్కలు పెంచుకునే కొమ్మలు వాలడం, ఇంటి ముందు రాళ్ళ కుప్ప విషయంలో గొడవ పడుతున్నారని బాధితురాలు తెలిపింది. ఇంటి పక్కన సర్దుకుపోయే బదులు చిన్న చిన్న విషయాలకే తరచుగా వాదన చేస్తూ దౌర్జన్యంగా మాపై దాడులు చేస్తున్నారని ఆ మహిళ వాపోయింది.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

మహిళాపై విచక్షణ రహితంగా దాడి

కట్టెలు, రాళ్ళతో జరిపిన ఈ దాడిలో బాధితురాలి తలకు మరియు శరీర భాగాల్లో తీవ్ర రక్త గాయాలయ్యాయి. వెంటనే ఆమెను గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో ఎస్‌.ఐగా పనిచేస్తున్న జయరాం కుటుంబానికి చెందిన సభ్యులే మహిళాపై విచక్షణ రహితంగా దాడి చెందడం గమనార్హం. బాధితురాలి భర్త అనిల్ కుమార్, ఈ విషయాన్ని జిల్లా అధికారులకు మరియు మీడియాకు వెల్లడించారు. నిజాయితీగా, పారదర్శకంగా ఈ కేసును దర్యాప్తు చేయాలని కోరారు. జరిగిన ఘటనపై గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కళ్యాణ్ కుమార్ తెలిపారు.

దాడిని ఖండించిన బీజేపీ నాయకులు
బాధితురాలుపై జరిగిన దాడిని బిజెపి నాయకులు ఖండించారు. తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి డి కె సిద్ధారెడ్డి, పలువురు నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

 Also Read: Gadwal Town: ఇళ్ల మధ్యనే కల్లు విక్రయాలు.. పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!