Gadwal MRO (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal MRO: సామాన్యులకు రేషన్ కార్డుల తిప్పలు

Gadwal MRO: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా, వాటికోసం దరఖాస్తు చేసుకోవాలన్నా రేషన్‌కార్డు(Food Safety Card) తప్పనిసరి. కార్డు ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నడంతో లబ్ధిదారులు వాటిని పొందేందుకు నాన్న అవస్థలు పడుతున్నారు. కొత్తగా రేషన్‌కార్డు పొందడం, ఉన్నకార్డులో నుంచి పేర్ల తొలగింపు, పిల్లల పేర్లను నమోదు(రేషన్​ కార్డులో చేర్పించడం) చేయించడంపై కొందరు గ్రామీణులకు అవగాహన లేకపోవడంతో దళారులకు వరంగా మారింది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రేషన్‌ కార్డుల పేరిట వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు.

తర్వాత రమ్మని తిప్పుతున్నారు
కొత్త రేషన్‌ కార్డు(Ration card)ల మంజూరు కోసం తహసీల్దార్‌(MRO) కార్యాలయాల సిబ్బంది ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.800 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేషన్‌ కార్డుల కోసం వెళ్తే కార్యాలయాల సిబ్బంది సర్వర్‌ బిజీగా ఉందని, సైట్‌ ఓపెన్‌ కావడం లేదని, తర్వాత రమ్మని తిప్పుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పని కావడం లేదని వాపోతున్నారు. రెవెన్యూ సిబ్బందికి డబ్బులు ముట్టచెబితే మాత్రం కొత్త రేషన్‌కార్డులు వెంటనే మంజూరు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరగలేక డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని లబ్ధిదారులు అంటున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ ను వివరణ కోరగా మా కార్యాలయంలో రేషన్‌కార్డుల మంజూరు కోసం ఎవరి వద్దనుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదని ఒకవేళ సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: Protest at Uppal Stadium: ఉప్పల్ స్టేడియం గేట్లు ముస్తూ ప్రహరీ గోడ నిర్మాణం

అన్నీ తామే చూసుకుంటాం: దళారులు
రేషన్‌కార్డు కోసం మీసేవ సెంటర్లలో దరఖాస్తు చేసినటువంటి పత్రాలను తహసీల్దారు ఆఫీసులో సమర్పిస్తే అర్హులను గుర్తించి తహసీల్దారు(MRO) సిఫారసు మేరకు ఉన్నతాధికారులు రేషన్‌కార్డులను మంజూరు చేస్తారు. దీనిపై దరఖాస్తుదారులకు అంతగా అవగాహన లేకపోవడం‌తో ఆయా మండలాలో కొన్ని ఇంటర్నెట్ నిర్వాహకులు, మద్యవర్తులు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఒక్కొక్కరి నుంచి రూ.500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: అలివేలు- గద్వాల ఆర్డీఓ
అర్హులైన ప్రతీ ఒక్కరికి సర్కారు రేషన్‌కార్డులను మంజూరు చేస్తుంది. ఇందుకోసం ప్రజలు ఎవరూ దళారులను ఆశ్రయించొద్దు. రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మాకు ఫిర్యాదు చేయాలి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. తహసీల్దార్ కార్యాలయాల నుంచి రిపోర్ట్ తెప్పించుకుని పరిశీలిస్తామని తెలిపారు.

Also Read: Drunken people Hulchul: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. చివరికి!

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు