Drunken people Hulchul: తాగిన ఐతే ఏంది..? నేను ఊద ఎందుకు జబర్దస్త్ చేస్తున్నారు. అన్యాయం చేస్తున్నారు. అంటూ పోలీసుల(Police)కు పట్ట పగలే చుక్కలు చూపించాడు ఓ మందు బాబు. మద్యం సేవించి వాహనం నడుపుతూ వచ్చి వర్ధన్నపేట(WardhannaPet) పోలీసులకు చిక్కి బ్రిత్ అనలైజర్ ఊడకుండ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. బుధవారం పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk And Drive) తనికి నిర్వహిస్తుండగా మారేపల్లి శేఖర్ (28) అనే యువకుడు వర్ధన్నపేట నుంచి వరంగల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
Also Read: Aishwarya Rajesh: నలుగురు కాదు.. ఆరుగురు అయినా చేస్తా..!
పోలీసులను చూసిన శేఖర్
మందు బాబులం మేము మందు బాబులం. మందు తాగితే మాకు మేము మహారాజులం” అంటూ కేకలు వేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు, “ముట్టుకోవద్దు… పట్టుకోవద్దు… దొరకబట్టొద్దు… మీకు నేను దొరకను” అంటూ పోలీసులకు చిక్కకుండా నానా హంగామా సృష్టించాడు.”చిక్కడు దొరకడు” అన్నట్టుగా వ్యవహరించిన శేఖర్(Shekar), పోలీసులు ఎంత ప్రయత్నించినా లొంగలేదు. బ్రీత్ అనలైజర్ ఊదమంటే పైపు నోట్లో పెట్టుకుని ఊద కుండ “నా ఊపిరి ఇంతే నేను ఇంతే” అంటూ మరింత వీరంగం సృష్టించాడు.
ఈ తాగుబోతును పట్టుకోవడానికి పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారు. దాదాపు మూడు చెరువుల నీళ్లు తాగించినంత పని చేశాడు. ఈ మందుబాబు. మొత్తానికి “మందుబాబులతో పెట్టుకుంటే ఇంతే” అన్నట్టుగా పోలీసులకు ఓ విభిన్నమైన అనుభవాన్ని మిగిల్చాడు.
Also Read: Congress: కేటీఆర్‌కు భట్టి, పొంగులేటి ఓపెన్ ఛాలెంజ్.. స్వీకరిస్తారా?