Aishwarya Rajesh: ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఏ రేంజ్‌లో హిట్ కొట్టిందో తెలిసిందే. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. రిలీజైన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి, మంచి విజయం అందుకుంది. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని మూవీ టీమ్ చేసిన వీడియోలన్నీ వైరల్ అయ్యాయి. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. తాజాగా ఓ ఈవెంట్‌కు గెస్ట్‌గా వెళ్లిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తన పాత్ర ఎంపికపై పలు వ్యాఖ్యలు చేయగా ఇప్పుడవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Also Read – Fish: వర్షాకాలంలో చేపలు అదే పనిగా లాగించేస్తున్నారా… అయితే, డేంజర్లో పడ్డట్టే?
‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఏడాది వెంకీమామకు మంచి హిట్ ఇచ్చిన సినిమా. ఇందులో ఐశ్వర్య నలుగురు బిడ్డల తల్లిగా నటించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో నలుగురు పిల్లలకు తల్లిగా నటించడానికి తన వయసు సరిపోకపోయినా.. పాత్ర డిమాండ్ చేస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథ గురించి చెప్పినప్పుడు చాలా ఆలోచించాను. ఈ సినిమా కంటే ముందే నేను పిల్లల తల్లిగా యాక్ట్ చేశాను. ఇప్పుడున్న జనరేషన్‌లో.. పిల్లల తల్లిగా చేసిన యంగ్ హీరోయిన్లలో నేను ఫస్ట్ ఉంటాను. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సీక్వెల్ వస్తే అందులో ఆరుగురు పిల్లలకు తల్లిగా నటించాల్సి ఉంటుందని అనిల్ రావిపూడి నాకు చెప్పారు. ఆరుగురు పిల్లలకు తల్లిగా అయినా తాను నటించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. దీంతో ఆమెకు నటనపై ఉన్న కమిట్‌మెంట్ ఏంటో అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యలను కొంత మంది అభిమానులు మాత్రం పాజిటివ్‌గా తీసుకోలేక పోతున్నారు. ఒకసారి అలాంటి పాత్రలు చేస్తే తర్వాత అన్నీ అవే వస్తాయని వారు భయపడుతున్నారు. ఐశ్వర్య రాజేష్ మాత్రం దీనిని పాజిటివ్‌గా తీసుకుని ఏ పాత్ర ఇచ్చినా సమర్థవంతంగా చేస్తానని తెలిపారు.
Also Read – HHVM: శివుడు, విష్ణువుల అవతారం ఈ ‘వీరమల్లు’.. ఆ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్!
ఐశ్వర్య రాజేష్ నటనకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో తన పాత సినిమాలను చూస్తే తెలుస్తుంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ వంటి నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించారు. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. అమెరికాలో జరిగిన ‘తానా’ వేడుకల్లో పాల్గొని అక్కడి వారితో కలిసి సందడి చేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని కొన్ని సీన్లను అక్కడ ఉన్న తెలుగు వారితో పెర్ఫామ్ చేయించారు. అందులోని ‘ఓకే బా’ అనే డైలాగ్ చెప్పి అక్కడివారిని ఉత్సాహపరిచారు. అనంతరం ఐశ్వర్య మాట్లాడుతూ.. తాను తెలుగు కుటుంబంలోనే జన్మించానని, తన కుటుంబ సభ్యులు అంతా ఇక్కడే ఉన్నారని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు