Fish: చేపలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. చేప కూర, చేప పులుసు, చేప ఫ్రై.. ఇలా దీంతో ఏ కర్రీ చేసినా కూడా నోరూరిపోతుంది. ఒక్కసారి చేప పులుసు తిన్నామంటే, రెండు రోజులు అదే రుచి నాలుక మీదే ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ చేపలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. విటమిన్లు, పోషకాలు బాగా ఉండే ఈ చేపలు శరీరానికి బలాన్నిస్తాయి.
అలాగే అందరికీ శక్తినిస్తాయి. అయితే, వర్షాకాలం వచ్చిందంటే చేపలు తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే, ఈ సీజన్‌లో చెరువులు, కాలువలు, నదుల్లో నీళ్లు కలుషితమవుతాయి. వర్షం వల్ల చెత్త, వ్యర్థ పదార్థాలు, మురికి నీళ్లు అన్నీ చేరి నీటిని అపవిత్రం చేస్తాయి. చేపలు ఈ కలుషిత నీటిని తాగడం, అందులోని మురికి ఆహారాన్ని తినడం వల్ల వాటి నాణ్యత పడిపోతుంది. అలాంటి చేపలు తింటే, జీర్ణ సమస్యలు, అలర్జీలు, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
Also Read: Sugar: 30 రోజులు చక్కెర మానేస్తే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం కూడా దెబ్బ తినే అవకాశం ఉంది. అందుకే, వర్షాకాలంలో చేపలకు కాస్త దూరంగా ఉండటమే బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ధర తక్కువగా ఉందని, రుచి బాగుంటుందని ఆశపడితే, ఆస్పత్రి బిల్లులతో జేబు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, వర్షాకాలంలో చేపల కూరకు బైబై చెప్పి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మంచిది.
Also Read: RK Sagar: త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ‘ది 100’
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.