Bhatti and Ponguleti
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Congress: కేటీఆర్‌కు భట్టి, పొంగులేటి ఓపెన్ ఛాలెంజ్.. స్వీకరిస్తారా?

Congress: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు (KTR) తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అప్పుల పాలు చేసిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి 18 గంటలు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. మళ్లీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం.. స్వచ్ఛంగా, స్పష్టంగా ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసమని చెప్పారు. పట్టుమని పది ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు గాని తప్పులు మాటలు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాలోని సోమల తండాలో ఏడు రకాల అభివృద్ధి పనులకు రూ.71.43 కోట్లు, కేసముద్రం మండలంలో 36 రకాల పనులకు రూ.223.35 కోట్లతో అభివృద్ధి కోసం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖలతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన సోమలతండ, కేసముద్రం మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గత పదేళ్లు పరిపాలించిన పాలకులు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేదన్నారు.

Read Also- Viral Video: రీల్స్ పిచ్చితో కూతురు ప్రాణాలు పణంగా పెట్టిన తండ్రి.. జస్ట్ మిస్!

Telangana Ministers

ఊరుకునే ప్రసక్తే లేదు!
‘ ఇందిరమ్మ రాజ్యం అంటేనే సుపరిపాలనకు అద్దం పడుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలన అంటేనే నిరుపేదలు, రైతుల కోసం కృషి చేసే ప్రభుత్వం. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం మూడు నెలల్లోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు రూ.21 వేల కోట్లతో అమలు చేసింది. దేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతులకు సంబంధించిన 29 లక్షల పంపుసెట్లకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12,500 కోట్లు భరిస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, వడ్డీ లేని డ్వాక్రా రుణాల కోసం రానున్న ఐదేళ్లలో 100 కోట్లు అందించనున్నది. మొదటి ఏడాది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లను కేటాయించి రూ.22,500 కోట్లను ప్రభుత్వం భరిస్తుంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించని బీఆర్ఎస్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం సహించదు’ అని భట్టి హెచ్చరించారు.

Bhatti Vikramarka

నష్టాన్ని సరిచేస్తున్నాం..
మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. కృష్ణ, గోదావరి బేసిన్ నీళ్లకు మీ ద్వారా జరిగిన నష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సరి చేస్తోందన్నారు. 2019లో ఆంధ్రా సీఎంగా గెలిచిన వైఎస్ జగన్ వద్దకు వెళ్లి నీళ్లను ధారాదత్తం చేసిన ఘనత కేసీఆర్ ది కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కెసిఆర్ ఫ్యామిలీకి మైండ్ బ్లాంక్ అయి పిచ్చికుక్కల్లా, సంస్కారహీనుల మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పు చేసిన గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి మీ అందరి సహకారంతో ఏర్పడిందని చెప్పారు. ఎన్నికల హామీల్లో చెప్పినవి.. చెప్పనిది అన్ని రకాల సంక్షేమ పథకాలను ఇందిరమ్మ ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వమని, గత ప్రభుత్వం అప్పులు చేస్తే ఈ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. రైతన్నను రాజును చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు. దేశంలోనే 21 వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదని కొనియాడారు. తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రైతు ఖాతాల్లో రైతు భరోసా వేసిన ఘనత ఇందిరమ్మ ప్రజా పాలన ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సీఎం అనే గౌరవం లేకుండా కేటీఆర్ మాట్లాడడం హేయనీయ చర్యని వ్యాఖ్యానించారు. పేదోళ్ల సొమ్ము పందికొక్కుల తిన్నారని.. లక్షల కోట్లు వెనకేసుకుని కాకమ్మ కథలు చెబుతున్నారని మండిపడ్డారు. కర్రు కాల్చి వాత పెట్టిన సిగ్గు రాలేదని.. అధికారం కోసం రంకలేస్తున్నారే తప్ప పేదోడి బాధలు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పాలన చూసి బీఆర్ఎస్ నాయకులు విషం చిమ్ముతున్నారని ఫైరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నదంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోల్పోతే తమ పని ఖతమేనని భయంతో డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో వేసే రంకెలకు ఈ సర్వే సమాధానమని పొంగులేటి చురకలు అంటించారు.

Read Also- Upasana: చరణ్‌కు అయ్యప్ప.. నాకు సాయి బాబా!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?