Upasana
ఎంటర్‌టైన్మెంట్

Upasana: చరణ్‌కు అయ్యప్ప.. నాకు సాయి బాబా!

Upasana: ఉపాసనా కామినేని కొణిదెల (Upasana Kamineni Konidela)లోని మరో కోణం తెలిపే కథనమిది. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ హెల్త్‌కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ.. అందరికి టిప్స్ చెప్పే ఉపాసన.. తనలోని ఆధ్యాత్మికతపై నోరు విప్పారు. ఆధ్యాత్మికత విషయాలపై ఆమె గొప్ప నమ్మకంతో ఉంటారనే విషయం తెలియంది కాదు. మెగాస్టార్ ఇంట్లో జరిగే పూజల్లో ఆమె ఇప్పటికే ఎంతో సాంప్రదాయంగా కనిపించి, తనకు భక్తి ఎక్కువే అని చాటారు. తాజాగా ఆమె ఒక వీడియోలో తనకు సాయి బాబా మీద ఉన్న భక్తి గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సాయి బాబా వ్రతం, దానివల్ల తన జీవితంలో జరిగిన మార్పులపై తన అనుభవాలను పంచుకున్నారు. అత్తమ్మ కిచెన్ పుస్తకంలో ఉన్న శ్లోకాలను చదువుతూ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

Also Read- HHVM: శివుడు, విష్ణువుల అవతారం ఈ ‘వీరమల్లు’.. ఆ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఆస్తికులైన ప్రతి ఒక్కరికీ ఇష్టదైవం వుంటుంది. నా భర్త రామ్ చరణ్‌ (Ram Charan)కు అయ్యప్ప స్వామి (Ayyappa Swami) అంటే భక్తి. నాకు సాయి బాబా పట్ల విశ్వాసం, నమ్మకం. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తాతయ్య, అమ్మమ్మలు, అమ్మా నాన్నలంతా.. దేవుడంటే ఎంతో భక్తితో ఉండేవాళ్లు. వాళ్లని చూసి నాకు కూడా ఆ విశ్వాసం బలంగా పెరిగింది. జీవితం కష్టంగా ఉన్న సమయంలో, ఏటూ తేల్చుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి సాయి బాబా వ్రతం (Sai Baba Vrat) ఆచరించమని వారంతా నాకు చెబుతూ ఉండేవాళ్లు. ఆ కథ చదవటం మొదలుపెట్టిన తర్వాతే నా జీవితంలో మార్పులు మొదలయ్యాయి” అని ఉపాసన చెప్పుకొచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..

Also Read- Bhairavam OTT: ‘భైరవం’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

‘‘ అప్పటి నుంచి నా జీవితంలో ఒక్కొక్కటి మారుతూ వచ్చింది. నేను కూడా చాలా పాజిటివ్‌గా మారాను. నా చుట్టూ ఉన్న వాళ్లను చూసే కోణంలో కూడా చాలా మార్పు వచ్చింది. వారంతా హాయిగా మారిపోయారు. ఇవి చిన్న చిన్న మార్పుల్లా కనిపించినా, వ్యక్తిత్వంగా చాలా గొప్ప మార్పులు నాలో వచ్చాయి. అందుకే ఈ వ్రతంపై చాలా విశ్వాసం, నమ్మకం ఏర్పడింది. జీవితంలో ఏదైనా అడ్డు ఎదురైనప్పుడు, ఏదీ సరిగా జరగనప్పుడు, వ్రతం వంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో ఏ మందు చేయని పని, విశ్వాసం అది చేస్తుంది’’ అని అన్నారు. ఆధ్యాత్మికతను అలవాటు చేసుకుంటే.. మనిషిలో గొప్ప మార్పులు వస్తాయి. అలాగే ఉపవాసాలు, వ్రతాలు మన మనసును శుభ్రం చేస్తాయి. వాటిపై నిజమైన నమ్మకంతో చేస్తే కచ్చితంగా జీవితంలో మార్పులు వస్తాయని ఉపాసన ఈ వీడియో ద్వారా తెలియజేశారు. ఈ వీడియో ఆధ్యాత్మికత పట్ల గొప్ప స్ఫూర్తిని కలిగిస్తుందనడంలో అతిశయోక్తి లేనే లేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!