Protest at Uppal Stadium (imagecredit:swetcha)
హైదరాబాద్

Protest at Uppal Stadium: ఉప్పల్ స్టేడియం గేట్లు ముస్తూ ప్రహరీ గోడ నిర్మాణం

Protest at Uppal Stadium: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇకపై మ్యాచులు జరగడానికి అంతరాయం ఏర్పడనుంది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోనికి ప్రేక్షకులు వెళ్ళేందుకు ఉపయోగించే కొన్ని గేట్లను స్థలం యజమానులు మూసివేశారు. స్టేడియం ప్రక్కన ఉన్న పార్కింగ్ స్థలం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడంతో స్టేడియంలోనికి వెళ్లే గేట్ల ముందు ప్రహరీ గోడ నిర్మించారు. ఉప్పల్ ఇండస్ట్రియల్ ప్రాంతం కోసం గత ఆంధ్రప్రదేశ్(AP) ఉమ్మడి ప్రభుత్వం 500 ఎకరాలు ఏపిఐఐసీ(APIIC)కి కేటాయించింది. స్థలాన్ని అభివృద్ధి చేసి కంపెనీలకు ఇచ్చినప్పుడు పెంగ్విన్ టెక్స్ టైల్ కంపెనీ(Penguin Textile Company) 46 ఎకరాల భూమిని దక్కించుకుంది.

అందులో 16 ఎకరాలు క్రికెట్ స్టేడియానికి
కొన్ని సంవత్సరాలు నడిచిన తరువాత కంపెనీ మూతపడింది. చేసిన అప్పులు తీర్చలేక 30 ఎకరాల స్థలాన్ని బ్యాంకుకి అప్పజెప్పగా 2019 లో బ్యాంక్ వేలంలో బిల్డ్ బ్రిగ్స్ అనే సంస్థ వేలంతో దక్కించుకుంది. హెచ్ సీఏ 23.5 ఎకరాల స్థలంలో స్టేడియం నిర్మించింది. అదనంగా ఆక్రమించిన 16 ఎకరాల ల్యాండ్‌ను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన బిల్డ్ బ్రిగ్స్(Build Bricks) అనే సంస్థకి చెందిన 22.5 ఎకరాల భూమిలో క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు పార్కింగ్ కోసం, ప్రేక్షకులను లోపలికి ఈ స్థలం గుండా స్టేడియంలోనికి వెళ్ళేలా గేట్లను ఏర్పాటు చేశారు.

ఇప్పుడు బిల్డ్ బ్రిగ్స్ అనే సంస్థ తన స్థలాన్ని రక్షించుకునేందుకు ఫ్రీ వాల్స్ తో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టింది. పార్కింగ్ నుంచి స్టేడియంలోకి వెళ్ళే గేట్ల వద్ద ప్రహరీ గోడ నిర్మించింది. బిల్డ్ బ్రిగ్స్ అనే సంస్థ చర్యలతో ఉప్పల్ క్రికెట్(Cricket) స్టేడియానికి మ్యాచులు జరిగే పరిస్థితి లేకుండా పోతోంది. మున్ముందు మ్యాచులు జరుగుతాయా? లేవా! అనే సందిగ్ధం ఏర్పడింది. మ్యాచ్‌లు జరిగినప్పుడు స్టేడియం ప్రక్కన ఉన్న స్థలాన్ని పార్కింగ్‌కు ఉపయోగించుకునేవారు. ఇప్పుడు మరింత ఇబ్బందిగా మారింది. ఈ విషయం తెలుసుకున్న విహెచ్ ఉప్పల్ స్టేడియం వద్దకు వెళ్లి ఉదయం నుంచి నిరసన చేపట్టారు.

Also Read: CM Revanth Reddy: పక్కా వ్యూహంతో ఢిల్లీకి సీఎం.. టీడీపీ బీజేపీకి చెక్ పెట్టేలా ప్లాన్!

కొనసాగుతున్న విహెచ్ హనుమంతరావు నిరసన
విహెచ్ స్టేడియం వద్ద బిల్డ్ బ్రిగ్స్ సంస్ధ నిర్మించిన ప్రహరీ గోడను ప్రైవేట్ జేసీబీ తో కూలగోట్టే ప్రయత్నం చేశారు. జెసిబిని అడ్డుకుని పోలీసులు(Police) వెనక్కి పంపించారు. స్టేడియం చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడ నిర్మాణాన్ని కూల్చాలని విహెచ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విహెచ్(VH Hnumantha Rao) మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పోర్ట్స్ సిటీ కి ప్రాధాన్యత ఇస్తుంటే ప్రైవేట్ సంస్థలు అపార్టుమెంట్లు, బిల్డింగ్ లు నిర్మించుకుంటూ, సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ సిటీకి అడ్డంకాలు కల్గిస్తున్నాయన్నారు. పోలీసులు ప్రభుత్వానికి మద్దతు చేయాల్సింది పోయి ప్రైవేట్ సంస్థకి మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. కచ్చితంగా ఈ స్థలం స్టేడియానికే దక్కాలి. హైడ్రా(Hydraa) కమిషనర్ వచ్చి నిర్మాణాలను తొలగిస్తానని అన్నారు. తొలగిస్తానన్న ప్రహారీ నిర్మాణాన్ని తొలగించక కనీసం స్టేడియం వద్దకు కూడా రావడం లేదన్నారు. ఈ సమస్య తీరే వరకు ఉప్పల్ స్టేడియం వద్దనే నిరసన వ్యక్తం చేస్తానని విహెచ్ అన్నారు.

తూతూ మంత్రంగా కూల్చివేతలు
గేటు నెంబర్ 5 వద్ద నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా సిబ్బంది తూతూ మంత్రంగా కులగొట్టారు. స్టేడియం చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడ మొత్తాన్ని తొలగించాలని వి హనుమంతరావు(Hanumantha Rao) నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: CM Revanth Reddy: కేంద్రమంత్రి మాండవీయతో సీఎం రేవంత్ చర్చలు

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు