Gadwal: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం పార్లమెంటులో చర్చించి ఆమోదించాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(Gadwal MLA Krishnamohan Reddy) పేర్కొన్నారు. గద్వాల జిల్లా(Gadwal District) కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మాణం చేసిన సందర్భంలో నేను కూడా నా సంపూర్ణ మద్దతు తెలుపడం జరిగిందన్నారు. నేడు ఢిల్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఢిల్లీలో ధర్నా కార్యక్రమంలో నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి,(Revanth Reddy) మంత్రులు, ఎమ్మెల్యేలకు నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) స్పందించి కేంద్రం కూడా వెంటనే బీసీల బిల్లుకు మద్దతు తెలిపాలని డిమాండ్ చేశారు.
Also Read: BC Meeting: గులాబీ తీరుతో క్యాడర్ గందరగోళం.. అయోమయంలో నేతలు
3500 ఇందిరమ్మ ఇల్లు మంజూర
పేదలకు రేషన్ కార్డులు (Ration cards)మంజూరు పట్ల హర్షం ఎంతో కాలంగా నూతన కార్డులు లేక పేదలు, మధ్యతరగతి ప్రజలు అనేక సంక్షేమ పథకాలకు దూరమయ్యారని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల(Ration cards) మంజూరుతో పాటు కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు కూడా చేర్చి రేషన్ కార్డులు(Ration cards) కొత్తవి ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. అదేవిధంగా పేదల సొంతింటి కల నెరవేర్చడం లో భాగంగా గద్వాల నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, పనులు వేగంగా జరుగుతూ ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
18.7 కోట్లు రూపాయలు
గద్వాల నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భవనాలు మరియు సబ్ స్టేషన్లు నిర్మాణాలకు సుమారు 40ఎకరాల 20 గుంట భూమి కేటాయిస్తూ జిఓలు జారీ చేసిందని వివరించారు. ధరూరు మండలంలో గుడెందొడ్డి, పెద్దపాడు గ్రామాల్లో మల్దకల్ మండలంలో ఉలిగేపల్లి, కుర్తిరావల్ చెరువు, గట్టు మండలంలో తుమ్మలచెరువు, రాయపురం గ్రామాల్లో, కేటి దొడ్డి మండలంలో సోంపురం గ్రామాల్లో మొత్తం 7 విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మాణం కోసం 18.7 కోట్లు రూపాయలు మంజూరు కావడం జరిగిందన్నారు.
వివిధ భవనాల నిర్మాణాల కోసం భూమి కేటాయింపుల వివరాలు
విద్యుత్ గోదాముల కోసం, విద్యుత్ పరికరాల సబ్ స్టోర్ ను 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 2 గిడ్డంగుల నిర్మాణం కోసం 20.5 కోట్లు రూపాయలు మంజూరు కావడం జరిగిందన్నారు.మల్డకల్ మండలం సంబంధించిన పిఎసిఎస్ భవన నిర్మాణం, వరి కొనుగోలు కేంద్రం నిర్మాణంకు,బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం కోసం 3 కోట్లు రూపాయలు మంజూరు కావడం జరిగిందన్నారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం 5 కోట్లు రూపాయలు మంజూరు కావడం జరిగిందన్నారు.
డిటివో/ఆర్టీవో/ యువో భవన సముదాయం, నిర్మాణంకు
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) భవన నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయల మంజూరు కావడం జరిగిందన్నారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం 33/11 KV సబ్ స్టేషన్ నిర్మాణం 4.5 కోట్లు రూపాయలు మంజూరు కావడం కోసం భూములను కేటాయించారు. అనేక అభివృద్ధి పనులకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి,(Revanth Reddy ఇంచార్జ్ మంత్రి దామోదర్ రాజనర్సింహ , జిల్లా జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఆయా కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థము అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, మాజీ కౌన్సిలర్స్ మురళి, మాజీ సర్పంచ్ రఘువర్ధన్ రెడ్డి, నాయకులు గద్వాల తిమ్మప్ప, ప్రభాకర్ గౌడ్,కురుమన్న, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Jr NTR:టాలీవుడ్ నుంచి మొదటి హీరో ఎన్టీఆర్.. ఫ్యాన్సుకు పూనకాలే..