ntr(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Jr NTR:టాలీవుడ్ నుంచి మొదటి హీరో ఎన్టీఆర్.. ఫ్యాన్సుకు పూనకాలే..

Jr NTR: ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘వార్ 2’ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందించిన ‘వార్‌ 2’పై ఇప్పటికే బజ్ ఉంది. ఫ్రపంచ వ్యాప్తంగా ఉన్న హృతిక్, ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కియార అడ్వాణీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి ప్రేక్షకులనుంచి మంచి ఆదరణ లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న ‘వార్‌ 2’ అంటూ బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు ఎన్టీఆర్‌. హృతిక్‌ రోషన్‌తో కలిసి ఆయన నటించిన ఈ సినిమాపై అభిమానులు బారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ తాజా ఎడిషన్‌ కవర్‌పేజీపై తారక్‌ (NTR) ఫొటోను ముద్రించింది. ఈ ఘనత సాధించిన మెదటి టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కావడం విశేషం. మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Rrad also- Allu Arjun: ఆ వీడియోతో మోసపోయిన అల్లు అర్జున్.. వెలుగులోకి సంచలన నిజాలు

‘‘వార్‌2’ (War 2) సినిమా కోసం భాషతో సంబంధం లేకుండా అందరూ కలిసి పనిచేశారు. ఉత్తరాది, ఇకపై బాలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్‌ అనేవి ఉండవు. దేశం అంతా ఒకటే ఇండస్ట్రీగా ఉండబోతుంది. దీనిని భారతీయ చిత్ర పరిశ్రమగా గుర్తించాలి. ఇలా తీస్తే సినిమాలు చేయడం చాలా ఈజీ అవుతోంది. అప్పుడు ప్రతి సినిమా హిట్‌ అవుతుంది. దీనికంటూ ఓ ప్రత్యేక ఫార్ములాలు అంటూ ఏవీ ఉండవు. ఇదే విషయాన్ని గతంలో చాలామంది ప్రముఖులు చెప్పారు. మంచి కథను ప్రేక్షకులకు నచ్చేలా చూపించాలంతే. నేను ‘వార్ 2’ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం బలమైన కథ. హృతిక్‌తో (Hrithik Roshan) కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది’’ అని చెప్పారు.

Rrad also- War 2 Record:మరో ఘనత సాధించిన ఎన్టీఆర్ సినిమా

ఇదే ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. తానలో చాలా కళలు ఉన్నాయని, తనకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అని, సమయం దొరికినపుడల్లా వంట చేయడానికి ఆసక్తి చూపుతానన్నారు. ఎన్టీఆర్ ఆయన భార్య ప్రణతి కోసం, స్నేహితుల కోసం వంట చేయడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. పునుగులు వేయడంలో తనకు ఎంతో అనుభవం ఉందన్నారు. ఇక తను వండిన బిర్యానీ అయితే చాలా ఇష్టంగా తింటానన్నారు. జీవితంలో ఏదీ ప్లాన్‌ చేసుకోనని, వచ్చిన అవకాశాలను నిజాయతీగా వినియోగించుకుంటానని తెలిపారు.

Just In

01

Koragajja: ‘కాంతార’ తరహాలో ‘కొరగజ్జ’.. గూస్‌బంప్స్ తెప్పించే మరో రూటెడ్ కథ వస్తోంది!

Gadwal: గద్వాలలో దొంగల హల్చల్.. వరుస ఘటనలతో జనాల బెంబేలు

Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

POCSO Case: పోక్సో కేసులో దోషికి తగిన శిక్ష విధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్..

Peddi: ‘పెద్ది’ షూటింగ్ వాయిదా.. కారణం ఏంటో తెలుసా?