Allu Arjun: అల్లు అర్జున్ (Allu Arjun)నటించిన పుష్ప 2: ది రూల్ సినిమాకి సంబంధించిన ఒక ఎడిటెడ్ (Pushpa 2 edited video)వీడియో బాగా వైరల్ అయింది. అయితే, ప్రస్తుతం ఇది వివాదంగా మారింది. సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో, భారతదేశానికి చెందిన B Unique Crew అనే డాన్స్ గ్రూప్ అమెరికాస్ గాట్ టాలెంట్ (AGT) సీజన్ 20లో పుష్ప సినిమా పాటకు పెర్ఫార్మ్ చేసినట్లు ఒక వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే, ఇది అందరూ నిజమనే అనుకున్నారు. అంతే కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ వీడియోకి రిప్లై ఇవ్వడం విశేషం. నేడు ఈ వీడియో గురించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి.
అసలేం జరిగిందంటే?
B Unique Crew అనే డాన్స్ గ్రూప్ AGT స్టేజ్‌పై పుష్ప చిత్రంలోని ఓ పాటకు డాన్స్ చేసినట్లు చూపించే వీడియోను పుష్ప చిత్ర బృందం అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.. జడ్జ్‌లు సోఫియా వెర్గారాతో సహా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్లు రాసుకొచ్చారు. దీనిని “సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన”గా కూడా చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ కూడా ఈ వీడియోను తన X, న్‌స్టాగ్రామ్ ఖాతాల్లో షేర్ చేస్తూ, పుష్ప గ్లోబల్ రీచ్ ఇదే అంటూ ప్రశంసించారు.
Also Read: Naa anveshana: నా అన్వేష్ తో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య.. సంచలనం రేపుతున్న ఆడియో కాల్
దీనిలో ఏది నిజం?
ఇప్పుడు ఈ వీడియో నిజం కాదు, ఫేక్ ఎడిట్ అని తేలింది. B Unique Crew అసలు AGTలో వేరే పాటకు పెర్ఫార్మ్ చేసినట్లు తెలిసింది. పుష్ప చిత్రంలోని పాటను ఎడిట్ చేసి జోడించడంతో ఈ వీడియో తప్పుదోవకు దారి తీసింది. ఈ వీడియో ఎడిటెడ్ అని పుష్ప టీమ్‌కు తెలిపారు, అలాగే, అల్లు అర్జున్ షేర్ చేసిన పోస్ట్‌ను కూడా సరిచేయమని కోరారు.
Also Read: Chitralayam Studios: మూడో సినిమాకు శ్రీకారం చుట్టిన చిత్రాలయం స్టూడియోస్.. ఈసారి రూటు మార్చారు!
అల్లు అర్జున్ , పుష్ప టీమ్ ఈ ఫేక్ వీడియోను నమ్మి షేర్ చేశారు, కానీ తర్వాత ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఇప్పుడు Xలో చర్చగా(social media controversy) మారింది. కొందరు అల్లు అర్జున్ ఈ ఫేక్ వీడియోను నమ్మడంపై విమర్శలు చేస్తున్నారు.