Gadwal District Collector: గద్వాల జిల్లాలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్(BM Santosh) ఆదేశించారు. విద్యార్థులు పాఠాన్ని కేవలం చదవడం మాత్రమే కాకుండా, దాని భావాన్ని పూర్తిగా అర్థం చేసుకునేలా బోధించాలని సూచించారు. గద్వాల(Gadwala) మండలం పూడూరు గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
విద్యార్థులతో ముఖాముఖి..
పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, హాజరు, యూనిఫాం ధారణను పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల(Students) తో మాట్లాడి, ఇంగ్లిష్ పాఠం(Lesson)లోని ఒక పేరాగ్రాఫ్‌ను చదివించారు. చాలామంది విద్యార్థులు(Students) చదివినదానికి అర్థం చెప్పలేకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల(Students)పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పాఠా(Lessonలు అందరికీ అర్థమయ్యేలా సులభరీతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు
పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటాన్ని కలెక్టర్ గుర్తించారు. విద్యార్థులంద(Students)రూ క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలని, ప్రతిరోజూ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఖచ్చితంగా ఉపయోగించి హాజరు నమోదు చేయాలని ఆదేశించారు. యూనిఫాం ధరించకపోవడం పట్ల కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల క్రమశిక్షణ, విద్యార్థుల సమానత్వానికి యూనిఫాం ప్రతీక అని గుర్తు చేస్తూ, విద్యార్థులంద(Students)రూ తప్పనిసరిగా యూనిఫాం ధరించేలా చూడాలని, ఈ నియమం పాటించని పక్షంలో ప్రిన్సిపల్‌కు మెమో జారీ చేస్తామని సంబంధిత అధికారులకు తెలిపారు.
క్రమశిక్షణతో చదవాలి..
పదవ తరగతి విద్యార్థులు(Students) మంచి ఫలితాలు సాధించడానికి ఇప్పటినుంచే క్రమశిక్షణతో చదవాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజూ పాఠాలను శ్రద్ధగా వినడం, అదే రోజు వాటిని పునశ్చరణ చేయడం, సందేహాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం, ప్రాక్టీస్ పరీక్షలు క్రమం తప్పకుండా రాయడం వంటి అలవాట్లను అలవర్చుకోవాలని ఆయన విద్యార్థుల(Students)కు ప్రేరణనిచ్చారు. అనంతరం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సహాయ లేబర్ కమిషనర్ మహేశ్ కుమార్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక, ప్రధానోపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా