Gadwal Collector: ఇటీవల గద్వాల మండలంలోని గుర్రంగడ్డ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పదోన్నతిపై మల్దకల్ మండలానికి వెళ్లడం జరిగింది… ఈ క్రమంలో గుర్రం గడ్డ పాఠశాలలో ఉపాధ్యాయు స్థానము ఖాళీ ఏర్పడింది…ఈ సందర్భంగా గుర్రంగడ్డలోని గ్రామ ప్రజలు విద్యార్థులు నిన్న అనగా సోమవారం ప్రజావాణిలో ఇట్టి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ గుర్రంగడ్డ పాఠశాలకు ఉపాధ్యాయుల కొరతను తీరుస్తూ కొన్ని గంటల్లో పరిష్కారం చూపారు.
Also Read: Collector Harichandana: పక్కా ప్రణాళికతో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించాలి: కలెక్టర్ హరిచందన దాసరి
నియామక ఉత్తర్వులు జారీ
గుర్రం గడ్డ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేరన్న విషయాన్ని తన దృష్టికి వచ్చిన తక్షణమే జిల్లా విద్యాశాఖ ను తదుపరి చర్యలకు ఆదేశించారు. ఒక గంటలోపే మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి ఇద్దరు విద్యా వాలంటీర్ల నియమించేలా నియామక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖ సమన్వయ అధికారి హoపయ్య , మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ , CRP సమీ నేటి ఉదయం 8:00 గంటలకు గుర్రం గడ్డ గ్రామానికి బయలుదేరి గ్రామస్తులతో మాట్లాడి కలెక్టర్ గారి ఆదేశాలను తెలియజేసి గ్రామస్తుల సమక్షంలో ఇద్దరి విద్యా వాలంటీర్లను నియమించి, వారికిచ్చే గౌరవ వేతన విషయాలను తెలియజేసి భవిష్యత్తులో ఏర్పడే నియామకాలలో ఇక్కడ ఖాళీ భర్తీ చేయబడుతుందని అంతవరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలియజేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ , జిల్లా సెక్టోరల్ అధికారి హంపయ్య CRP సమీ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
Also Read: Maruti Victoris: సరికొత్త కారును ఆవిష్కరించిన మారుతీ సుజుకీ… ధర, ఇతర వివరాలు ఇవే
భర్తపై వేడి నూనె పోసిన భార్య.. చికిత్స పొందుతూ మరణించిన భర్త వెంకటేష్
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందోడ్డి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది..నిద్రిస్తున్న భర్త వెంకటేష్ పై అతని భార్య నూనె వేడి చేసి పోసింది.. మల్దకల్ ఎస్సై నందికర్ తెలిపిన వివరాల ప్రకారం గత 8 సంవత్సరాల క్రితం వెంకటేశ్ పద్మకి వివాహం జరిగింది. కాగా వీరికి ముగ్గురు సంతానం ఉంది. కాగా వివాహం అనంతరం భార్య,భర్తలు తరచు గొడవ పడేవారని అందులో భాగంగా ఈ నెల 11 న ఉదయం 5 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్త వెంకటేష్ పై భార్య పద్మ వేడినూనెను పోసింది.
వెంకటేష్ కు తీవ్ర గాయాలు కాగా హుటాహుటైనా గద్వాల ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ కు చేశారు. చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం వెంకటేష్ మరణించడం జరిగింది..ఈనెల 11వ తేదిన సంఘటన జరిగిన రోజు భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం పద్మను రిమాండ్ కు తరలించడం జరిగిందని మల్దకల్ ఎస్ఐ నందీకర్ తెలిపారు.
Also Read: KTR: అసెంబ్లీ సెగ్మెంట్లలో గులాబీ సభలు!.. నేతల తయారీకి సూపర్ ప్లాన్..?
