Gadwal Congress leaders: గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడిన కార్యకర్తలను విస్మరిస్తే గద్వాల నుండి గాంధీభవన్ కు పాదయాత్ర చేస్తామని కాంగ్రెస్(Congress) పార్టీ నాయకులు, కార్యకర్తలు అదిష్టానాన్ని హెచ్చరించారు. గల్లి నుండి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఎస్సీ(SC) ఎస్టీ(ST), బీసి మైనార్టీ ప్రజల మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిందని అలాంటి ప్రభుత్వంలో గద్వాల ప్రాంతంలోని బడుగు బలహీన వర్గాల ఎదుగుదలను అణచివేతకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గురి చేస్తుందని మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విసృత స్థాయి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్, టిపిసిసి మెంబర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంజిపేట్ శంకర్ లతో పాటు వివిధ మండలాల నాయకులు, గద్వాల పట్టణ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
సరిత తిరుపతయ్య నాయకత్వంలో
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా 39వేల తేడాతో సంపత్ కుమార్(Sampath Kumar) ఓడిపోయినా పార్టీ హైకమాండ్ భుజాన మోస్తుందని, జిల్లాలో ప్రతి కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగేలా చూస్తున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు గద్వాలలో బలహీన పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్(Congress) పార్టీని బలోపేతం కోసం అధిష్టాన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య నేతృత్వంలో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారని అన్నారు. సరిత తిరుపతయ్య నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగిందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో సరిత ఓటమి పాలైన కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గంపెడు ఆశలతో నాయకులు, కార్యకర్తలు ఉన్నారని అన్నారు. బిఆర్ఎస్(BRS) పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోకుండానే పాత నాయకులను కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవరిస్తున్నారని ఆరోపించారు.
Also Read: Azharuddin: అజారుద్దీన్ ఇంట్లో దొంగలుపడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారంటే?
నాయకత్వంపై అధిష్టానం నిర్లక్ష్యం
ఓట్లు వేసింది మేము సంక్షేమ, అభివృద్ది ఫలాలు వారికా అని అన్నారు. గల్లి నుండి ఢిల్లీ(Delhi) దాక బడుగు బలహీనవర్గాల ప్రజలు రాజకీయంగా ఎదగాలని సంకల్పంతో 42 శాతం రిజర్వేషన్ బీసీల కల్పిస్తూ ఏఐసిసి అగ్రనేత పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాయకత్వంలో ముందుకు సాగుతున్న తరుణంలో అందుకు భిన్నంగా గద్వాల బీసీ(BC) నాయకత్వంపై అధిష్టానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ(Congress) కోసం ఓటు వేసిన కార్యకర్తలను విస్మరించి దొడ్డిదారిన వచ్చిన బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే లను ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి సంక్షేమ పథకాలు వారికి అందేలా ప్రోత్సహించడం ఎంత వరకు సమంజషం అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అరు గ్యారెంటీలు ఎలా వర్తింపజేస్తారో అదిష్టానాన్ని ప్రశ్నించారు. బిఆర్ఎస్(BRS) పార్టీ ఎమ్మెల్యే తాను ఏ పార్టీలో ఉన్నాడో తనకే తెల్వదని, అలాంటప్పుడు పార్టీ కండువ కప్పుకోకుండా కాంగ్రెస్(Congress) పార్టీ సమావేశాలో ఏ విధంగా పాల్పడుతున్నారో అదిష్టానం తెలుసుకోవాలన్నారు.
ప్రత్యర్థులు కుట్రలు
గద్వాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైన సమయంలో పార్టీని బలహీనపరచడానికి ప్రత్యర్థులు కుట్రలు పనుతున్నారని ఆరోపించారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారి కాకుండా దొడ్డిదారిన వచ్చిన నాయకులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశాలు కల్పిస్తే గద్వాల నుంచి గాంధీభవన్ కు పాదయాత్ర చేస్తామని హెచ్చిరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మధుసూదన్ బాబు, బల్గేర నారాయణ రెడ్డి, మహ్మద్ ఇసాక్, మాచర్ల వరలక్ష్మి వెంకటస్వామి గౌడ్, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, పెద్దపల్లి అల్వాల రాజశేఖర్ రెడ్డి, డిటిడిసి నర్సింహులు, భాస్కర్ యాదవ్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: CPI Narayana: సీఎం రేవంత్‌ను బ్లాక్ మెయిల్ చేస్తారా.. సీపీఐ నారాయణ ఫైర్!