Azharuddin: ‘దొంగలకు ఎలాంటి తారతమ్యాలు ఉండవు’ అనే సరదా మాట ఒకటి ఉంది. చోరులకు గుడి, బడి అని తేడా ఉండదు, ఖాళీగా కనిపిస్తే చాలు చోరీకి పాల్పడుతారు. చివరాఖరకు పోలీసుల ఇళ్లలో కూడా దొంగతనాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా, భారత క్రికెట్ జట్టుకు ఒక నాటి కెప్టెన్, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్‌ను కూడా దొంగలు వదల్లేదు. అజారుద్దీన్ భార్య, బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీకి చెందిన ‘లోనావాలా’ అనే బంగ్లాలో చోరీకి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని పుణె జిల్లా మావల్ తాలూకాలోని టికోనా పేత్ ప్రాంతంలో ఈ బంగ్లా ఉంది. మార్చి 7 – జూలై 18 తేదీల మధ్య ఈ చోరీ జరిగిందని పుణె రూరల్ పోలీసు అధికారులు శనివారం ప్రకటించారు.
Read Also- Donald Trump: ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
టీవీ సెట్ చోరీ
దొంగలను ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. రూ.7,000 ఖరీదైన టీవీ సెట్, రూ.50,000 నగదును అపహరించారని వివరించారు. మొత్తం కలిపి సుమారు రూ.57,000 వరకు నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఇంట్లోని చెట్లు, సామాన్లను సైతం ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. దీంతో, ఉద్దేశపూర్వకంగానే నష్టం కలిగించి ఉండవచ్చని చర్యగా పోలీసు అధికారులు భావిస్తున్నారు. బంగ్లా వెనుకభాగంలో ఉండే ఇనుప వైర్ మెష్‌ను కత్తిరించి దొంగలు లోపలికి ప్రవేశించారని, ఆ తర్వాత మొదటి అంతస్తులో ఉన్న గ్యాలరీ వరకు పైకెక్కి, విండో గ్రిల్‌ను తెరిచి ఇంట్లోకి ప్రవేశించారని పోలీసులు వివరించారు. మొహమ్మద్ అజారుద్దీన్‌కు పీఏగా పని చేస్తున్న 54 ఏళ్ల మొహమ్మద్ ముజీబ్ ఖాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని తెలిపారు. మార్చి 7 నుంచి జూలై 18 మధ్య కాలంలో ఇంట్లో ఎవరూ లేరని, ఆ సమయంలో ఈ చోరీ జరిగి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నట్టు వివరించారు.
Read Also- Viral News: గూగుల్, యూట్యూబ్‌లో సెర్చ్ చేసి..లివ్-ఇన్ పార్టనర్‌పై..
గుర్తు తెలియని దొంగలపై బీఎన్ఎస్ చట్టంలోని 331(3), 331(4), 305(ఏ), 324(4), 324(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పుణే రూరల్ పోలీసులు వివరించారు. జులై 19న అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదయింది. ఇప్పటివరకూ దొంగిలించిన వస్తువుల్లో ఒక్కటి కూడా రికవరీ చేయలేదు. కేసు నమోదు చేసిన తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్, ఫొరెన్సిక్ ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగలను గుర్తించి పట్టుకునేందుకు చర్యలు మొదలుపెట్టారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారులు త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
Read Also- Water Rocket: వాటర్ రాకెట్ తయారు చేసిన చైనా విద్యార్థులు.. వీడియో ఇదిగో