Water Rocket: సైన్స్ సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకుంటే ఎన్నో ఆవిష్కరణ పుట్టుకొస్తాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. చైనాకు చెందిన కొందరు విద్యార్థులు అదే చేసి చూపించారు. నీళ్లు, కోకా కోలా బాటిళ్లతో తయారు చేసిన 2 దశల వాటర్ రాకెట్‌ను గాల్లోకి విజయవంతంగా ప్రయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. పిల్లలు సొంతంగా తయారు చేసిన ఈ రాకెట్ భారీ ఫోర్స్‌తో కచ్చితత్వం ఆకాశంలోకి దూసుకెళ్లిన దృశ్యాన్ని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
రాకెట్ ప్రయాణంలో రెండో దశలో విడిపోయిన బాటిల్స్ కింద పడగా, మిగతా భాగం మరింత పైకి దూసుకెళ్లింది. విద్యార్థుల సమన్వయం, ఖచ్చితత్వంతో ప్రయోగాన్ని చేపట్టడడంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక, రాకెట్ సజావుగా కిందకు దిగేందుకు వీలుగా ప్యారాచూట్ సాయంతో వేగం తగ్గించుకుంటూ సురక్షితంగా నేలపైకి దిగేలా చేయడం ఈ ప్రయోగాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన్సూ యెంగెన్ అనే ఎక్స్ యూజర్ పంచుకున్నాడు. ‘‘చైనాలో విద్యార్థులు కోలా బాటిల్, వాటర్ ప్రెషర్‌తో రెండు దశల రాకెట్ తయారు చేశారు’’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
Read Also- AK-203: ఆర్మీ చేతికి కొత్త ఆయుధం.. నిమిషానికి 700 బుల్లెట్లు
ఈ వీడియో పోస్టు చేసిన తక్కువ సమయంలోనే 1.2 మిలియన్ (12 లక్షల) వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశఆరు. భౌతిక శాస్త్రంపై విద్యార్థుల అవగాహన, బృందంగా కలిసి పని చేసిన తీరును మెచ్చుకున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ, ‘ఇది అద్భుతం, ఆశ్చర్యంగా అనిపిస్తోంది!. పిల్లలు బాగా చేశారు’’ అని మెచ్చుకున్నారు. మరో యూజర్ స్పందిస్తూ.. ‘‘ ఇది చాలా మంచి ప్రయోగం. పిల్లలకు గొప్ప అనుభవం మిగులుతుంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి వాటర్ రాకెట్లను మేము కూడా స్కూల్ రోజుల్లో చేశాం. ఎవరిది ఎక్కువ ఎత్తు ఎగురుతుందో చూసుకుంటూ పోటీలు పెట్టుకునేవాళ్లం. భారతీయ పిల్లల్లో చాలామందికి ఈ అనుభవం గుర్తుండే ఉంటుంది. కనీసం 1990వ దశకం తర్వాత పిల్లలకైనా’’ అని పేర్కొన్నారు. వాటర్ రాకెట్ గొప్ప విషయమేమీ కాదని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘ఇదంత గొప్ప విషయం కాదు. నేను 1970ల్లో ఇలాంటివే చేసేవాడిని. కానీ, నేటితరం పిల్లలు సెల్‌ఫోన్‌లతో కాలక్షేపం చేస్తూ కొత్తగా ఏమీ చేయడం లేదు’’ అని పేర్కొన్నారు.
Read Also- Team India: నాలుగో టెస్టుకు స్టార్ ప్లేయర్!.. సిద్ధమైన మేనేజ్‌మెంట్?
ఎలా పనిచేసింది?
ఈ ప్రయోగంలో చైనా విద్యార్థులు ప్లాస్టిక్ బాటిల్, నీరు లాంటి సాధారణ పదార్థాలను ఉపయోగించారు. రెండు దశల వాటర్ రాకెట్‌ను తయారు చేయగా, నీరు, గాలి కలయికతో ఉత్పన్నమయ్యే ఒత్తిడి సూత్రంపై ఆధారపడి పైకి దూసుకెళ్లింది. మొదటి దశలో, బాటిల్‌లో ఉన్న ప్రెషరైజ్డ్ వాటర్‌ను విడుదల చేయడం ద్వారా రాకెట్ పైకి ఎగురుతుంది. రెండో దశలో, ఒక స్థాయి ఎత్తులో రాకెట్ విడిపోతుంది. దీంతో, నిల్వ ఉంచిన ఒత్తిడి పనిచేసి మళ్లీ పైకి ప్రయాణిస్తుంది. ఇక, రాకెట్ కిందకు దిగే సమయంలో, ప్యారాచూట్ విచ్చుకుంటుంది. దాంతో రాకెట్ నేలపై సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. ఈ ప్రయోగం ద్వారా విద్యార్థులు న్యూటన్ గమన నియమాలు, గాలి నిరోధం, ఒత్తిడి వంటి భౌతిక సూత్రాలను ప్రాక్టికల్‌గా అవగాహన చేసుకున్నారు.
In China, students made a two-stage rocket using a cola bottle and water pressure.
— Tansu Yegen (@TansuYegen) July 17, 2025