Local Body Elections: పల్లె పోరుకు పోటాపోటీగా నామినేషన్లు
Local Body Elections (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

Local Body Elections: పల్లె పోరుకు పోటాపోటీగా నామినేషన్లు.. అదృష్టానికి సిద్ధమవుతున్న విద్యావంతులు

Local Body Elections: ఎన్నికల్లో పోటీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని అర్హతలను నిర్దేశించింది. ఈ మేరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ రసం వసూలు చేస్తుంది నిర్దేశిత ఓట్లు వచ్చిన వారికి రసం తిరిగి చెల్లిస్తారు. ఆ మొత్తాన్ని డిపాజిట్ అని పిలుస్తారు. ఫలితాల అనంతరం అభ్యర్థికి కనీసం నోట్లో వస్తేనే డిపాజిట్ తిరిగి ఇస్తారు. డిపాజిట్ రావాలంటే పోలే చెల్లిన ఓట్లలో కనీసం 1/6 వంతు (16.66) ఓట్లు పొందాలి. ఈ నేపథ్యంలో వందకు కనీసం 17 ఓట్లు పొందాలి.

డిపాజిట్ కూడా రాకున్నా..

ప్రతి ప్రత్యక్ష ఎన్నికల్లో డిపాజిట్ పాత్ర ప్రధానంగా చర్చకు వస్తుంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నేతలు డిపాజిట్ గల్లంతు అనే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తుంటారు. డిపాజిట్ దక్కించుకొని అయినా పరువు కాపాడుకో అనే విషయాన్ని పార్టీ అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తుంటారు. గ్రామపంచాయతీలో సైతం డిపాజిట్ అనే పదానికి ప్రాముఖ్యత ఉంది. డిపాజిట్ కూడా రాకున్నా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాడంటూ గ్రామాల్లో బలమైన అభ్యర్థులు పోటీకి ఉత్సాహం చూపిస్తున్న ఆశావాహులపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తుంటారు. కొందరు ఎన్నికల్లో డిపాజిట్ దక్కదని తెలిసినా ఎదుటి వారిని ఓడించి ప్రతీకారం తీర్చుకునేందుకు అయినా పోటీకి వెనుకాడరు. ఇలాంటి సందర్భాలలో ఓకే సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి గెలుపుకు మరో వ్యక్తి తప్పుకుంటే గెలిచేవాడని చర్చ వస్తుంటుంది. ఎన్నికల్లో గెలవకుండా కనీసం డిపాజిట్ ను అయినా దక్కించుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతుంటారు. డిపాజిట్ గురించి తెలుసుకుంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం, జడ్పిటిసి(ZPTC), ఎంపీటీసీ(MPTC), సర్పంచ్ వార్డ్ ల వారిగా స్థానాలకు పోటీ చేసేందుకు రిటర్నింగ్ అధికారికి నగదు రూపంలో నిర్దిష్ట డబ్బు డిపాజిట్ పెట్టాల్సి ఉంటుంది. డిపాజిట్ కు సంబంధించిన రసీదును పొందిన తర్వాత నామినేషన్ పత్రానికి జత చేయాలి. లేని పక్షంలో నామినేషన్ పత్రాన్ని తిరస్కరిస్తారు సర్పంచ్ గా పోటీ చేసే జనరల్ అభ్యర్థులు 2 వేలు, ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC) అభ్యర్థులు వెయ్యి చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వార్డు సభ్యులుగా పోటీ చేసే జనరల్ అభ్యర్థులు 1000, ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC) అభ్యర్థులు 500 చొప్పున డిపాజిట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Telangana Agriculture: తెలంగాణలో అగ్రికల్చర్ రైజింగ్.. రైతు సంక్షేమానికి రూ.లక్ష కోట్లకు మించి ఖర్చు!

ఎన్నికల్లో 1/6 ఓట్లు రాకుంటే డిపాజిట్ గల్లంతే

ఎన్నికలు జరిగినా తర్వాత పోటీ చేసిన అభ్యర్థులకు పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు రావాలి. అంతకన్నా తక్కువ వస్తే అభ్యర్థి డిపాజిట్(Deposit) కోల్పోయినట్లు గుర్తిస్తారు. ఉదాహరణకు 500 ఓట్లు పోలై అన్ని చెల్లుబాటు అయ్యాయి, అనుకుంటే పోటీ చేసిన వారికి ఒక్కొక్కరికి 1/6 అంటే 85 ఓట్లు రావాల్సి ఉంటుంది. అప్పుడు అతడికి డిపాజిట్ దక్కినట్లు లేకపోతే డిపాజిట్ దక్కనట్లు అధికారులు ప్రకటిస్తారు. 1/6 లేదా అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోటీ చేసిన సమయంలో డిపాజిట్ చేసిన డబ్బులను తిరిగి ఇస్తారు. 1/6 కు కన్నా తక్కువ వచ్చిన వారి డిపాజిట్ డబ్బులను ఇవ్వకుండా వాటిని పంచాయతీ అభివృద్ధి ఖాతాలో జమ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికలు ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో అభ్యర్థులు పార్టీల మద్దతుతో గ్రామంలో అన్ని వర్గాలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తులు పోటీకి సిద్ధమై ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజల మద్దతు ఆశిస్తారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల సామర్ధ్యాలను, వ్యక్తిత్వాన్ని బేరీజు వేసుకొని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి,గ్రామాభివృద్ధికి పాటుపడతారనే విశ్వాసంతో ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారు.

Also Read: Ravi Teja: రవితేజ, శివ నిర్వాణ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ఆ యంగ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Just In

01

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా