Ravi Teja: మాస్ మహారాజా రవితేజ తన కొత్త సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. తనదైన మాస్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే రవితేజ, ‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘ఖుషి’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ క్రమంలో, ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా కోలీవుడ్ యువ నటి ప్రియా భవానీ శంకర్ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో ప్రియా భవానీ శంకర్ టాలీవుడ్‌లో మరింత లోతుగా అడుగుపెట్టనుంది. గతంలో ‘కళ్యాణం కమనీయం’, ‘జీబ్రా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా, ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ ఆమెకు పెద్ద బ్రేక్ అవుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ యాక్షన్-థ్రిల్లర్ కథలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ జోడీని “పవర్‌ఫుల్ కపుల్ డైనమిక్”గా చూపించబోతున్నారని తెలుస్తోంది.
Read also-Akhanda 2 Tickets: ‘అఖండ 2’ విడుదల సందర్భంగా ఐ బొమ్మ రవిని వెనకేసుకొచ్చిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే?
ఈ చిత్రం కోసం ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శివ నిర్వాణ తన రొమాంటిక్, ఎమోషనల్ చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు. కానీ, ఈసారి ఆయన రవితేజతో కలిసి యాక్షన్-థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేయనుండటం విశేషం. ఇది దర్శకుడికి ఒక కొత్త ప్రయత్నం కాగా, మాస్ ఎంటర్టైనర్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రవితేజ ఎనర్జీకి శివ నిర్వాణ టేకింగ్ తోడైతే సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, పాన్ ఇండియా స్థాయిలో దీనిని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రకటనలు, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Read also-Akhanda Promotion: బాలయ్య ‘అఖండ 2 తాండవం’ ప్రచారంలో వేరే లెవెల్.. ఇది వర్తే మామా..

