Akhanda 2 Tickets: ‘అఖండ 2’ విడుదల సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ సినిమాపై ఫర్ అయ్యారు. నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వడంపై నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ‘అఖండ 2’ సినిమాకు సంబంధించి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ. 75, మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ. 100 వరకు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా, ప్రీమియర్ షో టికెట్ ధరను ఏకంగా రూ. 600గా నిర్ణయించడంపై నారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారీ బడ్జెట్ సినిమాల కోసమని తరచుగా ఇలా టికెట్ ధరలు పెంచడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజల జోబులపై భారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read also-Annagaaru Vastaaru: కార్తి ‘అన్నగారు వస్తారు’ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?..
‘ఐ బొమ్మ’ ప్రస్తావన..
సినిమా టికెట్ ధరల పెంపుపై ఆయన స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. “మీరు సినిమా రేట్లను పెంచి ఐ బొమ్మ లాంటి వారిని సృష్టిస్తున్నారు” అని నారాయణ తీవ్రంగా వ్యాఖ్యానించారు. టికెట్ల ధరలు విపరీతంగా పెంచడం వలన సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారని, ఈ కారణాల వల్లే పైరసీ సైట్లు (ఐ బొమ్మ వంటివి) మరింత మందికి అందుబాటులోకి వచ్చి, పుట్టుకొస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలా టికెట్ రేట్లు పెంచడం వల్లే పైరసీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాలు కూడా ఇలా సామాన్యుడు ఏం అయిపోవాలని ప్రశ్నించారు. సినిమా రేట్లు పెంచడం ద్వారా సామాన్యులను సినిమాలకు దూరం చేస్తున్నారు. సినిమాను థియేటర్లో చూడలేని సామాన్య ప్రేక్షకులు పైరసీ వైపు మొగ్గు చూపడానికి ఇది ప్రధాన కారణం అవుతుంది. ఇలాగే ధరలు పెంచుకుంటూ పోతే ‘ఐ బొమ్మ’ లాంటి పైరసీదారుల సంఖ్య మరింత పెరుగుతూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Read also-Akhanda Promotion: బాలయ్య ‘అఖండ 2 తాండవం’ ప్రచారంలో వేరే లెవెల్.. ఇది వర్తే మామా..
ప్రభుత్వాల వైఖరిపై విమర్శలు..
ప్రభుత్వాలు, సినిమా నిర్మాతల విజ్ఞప్తుల మేరకు ఇలా టికెట్ ధరల పెంపునకు తరచుగా అనుమతులు ఇవ్వడం సరైంది కాదని నారాయణ విమర్శించారు. ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడకుండా, కేవలం భారీ చిత్రాల నిర్మాతలకు మద్దతుగా నిలుస్తోందని ఆయన ఆరోపించారు. సినిమా పరిశ్రమలో లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో సామాన్య ప్రేక్షకుడిని పణంగా పెడుతున్నారనేది ఆయన ప్రధాన వాదన. ‘అఖండ 2’ టికెట్ ధరల పెంపు నిర్ణయం, సామాన్య ప్రేక్షకులపై భారం, తద్వారా పైరసీ పెరుగుదలకు దారితీస్తుందన్న సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు, సినీ పరిశ్రమలోని ఆర్థిక అంశాలు, ప్రేక్షకుడి కొనుగోలు శక్తిపై చర్చకు తెరలేపాయి. అయితే ప్రభుత్వాలు కానీ, మూవీ టీం కానీ ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.
"అఖండ" సినిమా టికెట్లు పెంపుపై CPI నారాయణ ఆగ్రహం
I బొమ్మ రవి లాంటి వాళ్లను మీరే సృష్టిస్తున్నారు ఒకడిని లోపల వేస్తే 10మంది పుట్టుకొస్తారన్నారు
ప్రజల్లో మార్పు రావాలి IPL లోKKR టికెట్లు రేట్లు పెంచితే బాయ్ కాట్ చేశారు వెంటనే తగ్గించారు pic.twitter.com/VrBIqsC2C5— Kumar Reddy.Avula (@Kumar991957) December 3, 2025

