Annagaaru Vastaaru: కార్తి ‘అన్నగారు వస్తారు’ రిలీజ్ ఎప్పుడంటే?..
annagaru-vastaru(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Annagaaru Vastaaru: కార్తి ‘అన్నగారు వస్తారు’ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?..

Annagaaru Vastaaru: తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటించిన ప్రతి సినిమా ఇక్కడ మంచి ఆదరణ సాధిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే, కార్తీ తాజా తమిళ చిత్రం ‘వా వాతియార్’ తెలుగులోకి ‘అన్నగారు వస్తారు’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఆ అంచనాలను మరింత పెంచుతూ, ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ కార్తీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘అన్నగారు వస్తారు’ చిత్రం ఒక పక్కా యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో కార్తీ ఒక ఫుల్ ఎనర్జిటిక్ మరియు ఫన్ టచ్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు.

Read also-Akhanda Promotion: బాలయ్య ‘అఖండ 2 తాండవం’ ప్రచారంలో వేరే లెవెల్.. ఇది వర్తే మామా..

నేలన్ కుమారస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్న కథాంశాలతో సినిమాలు తీయడంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిష్టాత్మక స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. కార్తీ, కృతి శెట్టి కాంబినేషన్ చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు. సీనియర్ నటులు సత్యరాజ్, ఆనంద్ రాజ్, రాజ్ కిరణ్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగం కావడం సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను టాలీవుడు దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు.

Read also-Kalki 2: ‘కల్కి 2’ లో ప్రభాస్ సరసన గ్లోబల్ హీరోయిన్ ఎంట్రీ?.. అయితే ఫ్యాన్స్‌కు పండగే..

ఇటీవల విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. జాతర వాతావరణంలో కార్తీ పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇవ్వడం, జనంతో కలిసి ఉల్లాసంగా డ్యాన్స్ చేయడం, టీజర్ ఆద్యంతం ఆయన ఎనర్జీ, యాక్షన్ పతాక స్థాయిలో కనిపించాయి. ముఖ్యంగా, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు టీజర్‌ను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పడం కూడా సినిమాకు మరింత బజ్ తెచ్చింది. చాలాకాలంగా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఈ చిత్రం, డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రావడం పట్ల కార్తీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్తీ స్టైల్, యాక్షన్, కామెడీ అన్నీ సమపాళ్లలో ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందని సినీ వర్గాలు నమ్ముతున్నాయి. డిసెంబర్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రాల పోటీని తట్టుకుని ‘అన్నగారు వస్తారు’ ఎంతటి ఘన విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Just In

01

Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

OnePlus 13: OnePlus 13 ఫోన్ కు 10 వేల డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్